
ప్రొఫిషియెన్సీ ట్రైనీ పోస్టుల భర్తీకి స్టీల్ అథారిటీ ఆఫ్ఇండియా(ఎస్ఏఐఎల్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు మే 3వ తేదీలోగా ఆన్ లైన్ లో అప్లై చేయవచ్చు.
పోస్టుల సంఖ్య: 12
పోస్టులు: ప్రొఫిషియెన్సీ ట్రైనీ
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీ.ఫార్మా, బీఎస్సీ, డిప్లొమా, బీపీటీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఏదైనా రాష్ట్ర మెడికల్ కౌన్సిల్/ ఎంసీఐ/ ఎన్ఎంసీ పర్మినెంట్ రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. ఏదైనా రాష్ట్ర మెడికల్ కౌన్సిల్/ ఎంసీఐ/ ఎన్ బీఈ/ ఎన్ఎంసీ నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు.
వయోపరిమితి: జనరల్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 35 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
లాస్ట్ డేట్: మే 3.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ: మే 5.