PAK vs BAN: పసికూనపై ప్రతాపం.. 53 బంతుల్లో పాక్ బ్యాటర్ సెంచరీ

PAK vs BAN: పసికూనపై ప్రతాపం.. 53 బంతుల్లో పాక్ బ్యాటర్ సెంచరీ

పాకిస్థాన్ ప్రస్తుతం జింబాబ్వేతో వన్డే సిరీస్ ఆడుతుంది. ఇందులో భాగంగా నేడు (నవంబర్ 26) రెండో వన్డే జరిగింది. ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ ఓపెనర్ సైమ్ అయూబ్ మెరుపు సెంచరీతో ఆకట్టుకున్నాడు. పసికూన జింబాబ్వే బౌలర్లను ఒక ఆటాడుకుంటూ కేవలం 53 బంతుల్లోనే కెరీర్ లో తొలి సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో మొత్తం 63 బంతుల్లో 113 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ లో 17 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. 

149 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కేవలం 18.2 ఓవర్లలో 148 పరుగులు చేసి మ్యాచ్ గెలిచింది. ఛేజింగ్ లో పాక్ ఓపెనర్లు ఆరంభం నుంచి రేగి పోయారు. ముఖ్యంగా సైమ్ అయూబ్ బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ.. అదే ఊపులో సెంచరీ బాదేశాడు.  మరో ఎండ్ లో అబ్దుల్ షఫీక్ సింగిల్స్ కే పరిమితమయ్యాడు. అతను 48 బంతుల్లో నాలుగు ఫోర్లతో 32 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. 
 
అంతకముందు మొదట చేసిన జింబాబ్వే 32.3 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌటైంది. అబ్రార్ అహ్మద్ నాలుగు వికెట్లు తీయగా.. అఘా సల్మాన్ మూడు వికెట్లతో రాణించాడు.  ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ లో ఇరు జట్లు 1-1 తో సమంగా నిలిచాయి.  తొలి వన్డేలో పాకిస్థాన్ పై జింబాబ్వే ఓడిపోయిన సంగతి తెలిసిందే. సైమ్ అయూబ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. సిరీస్ లో చివరి వన్డే గురువారం (నవంబర్ 28) జరుగుతుంది.