సిద్ధార్థ్ క్షమాపణపై స్పందించిన సైనా

హీరో సిద్ధార్థ్ తనకు క్షమాపణ చెప్పడంపై భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ స్పందించారు. తప్పు తెలుసుకుని క్షమాపణ కోరడం సంతోషకరమని అన్నారు. కానీ ఓ మహిళ పట్ల ఇలాంటి కామెంట్లు చేయడం అసలు ఆమోదయోగ్యం కాదని అన్నారు. సిద్ధార్థను దేవుడు చల్లగా చూడాలని ఆకాంక్షించారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన సైనా " నాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి క్షమాపణ కోరాడు. వాస్తవానికి నా పేరు ట్విట్టర్ లో ట్రెండ్ అవడం చూసి ఆశ్చర్యపోయాను. అతనితో నేనేప్పుడూ మాట్లాడలేదు. ఒక మహిళను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఇప్పటికైనా క్షమాపణలు చెప్పడం సంతోషం. ఏదేమైనా ఆ దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ ఆయనకు ఉండాలి" అంటూ హుందాగా స్పందించారు.

ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటనలో తలెత్తిన భద్రతా లోపంపై సైనా ట్విట్టర్ వేదికగా స్పందించారు. దానిని రీట్వీట్ చేసిన నటుడు సిద్ధార్థ్ అభ్యంతరకరంగా కామెంట్ చేయడంపై పెద్ద దుమారం రేపింది. జాతీయ మహిళా కమిషన్‌ రంగంలోకి దిగింది. సైనా తండ్రి హర్వీర్‌ సింగ్‌, భర్త పారుపల్లి కశ్యప్‌ కూడా సిద్ధార్థ్ తీరును ఖండించారు. పలువురు ప్రముఖులు సైతం ఆయన వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో సిద్ధార్థ్ ఎట్టకేలకు దిగివచ్చాడు. సైనాను క్షమాపణ కోరుతూ బహిరంగ లేఖ రాశాడు. 

For more news..

కరోనాపై ఆటో డ్రైవర్ అద్భుతమైన మెసేజ్

ఇంకా ఐసీయూలోనే సింగర్ లతా మంగేష్కర్