భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ తన రిటైర్మెంట్ పై కీలక విషయాలను వెల్లడించింది. దీనికి కారణం కూడా లేకపోలేదు. తాను ఆర్థరైటిస్‌తో పోరాడుతున్నానని.. ఈ ఏడాది చివరి నాటికి బ్యాడ్మింటన్‌లో తన భవిష్యత్తును నిర్ణయించుకోవలసి ఉంటుందని వెల్లడించింది. అనారోగ్యం కారణంగా సాధారణ గంటలలో శిక్షణ పొందడం అసాధ్యం అని హౌస్ ఆఫ్ గ్లోరీ' పోడ్‌కాస్ట్‌లో నెహ్వాల్ అన్నారు.
"నేను రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నా.ఈ విషయం బాధ కలిగించేదే అయినా ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. క్రీడాకారుల కెరీర్ ఎప్పుడూ తక్కువ గానే ఉంటుంది. నేను 9 సంవత్సరాల వయస్సులో బ్యాడ్మింటన్ ఆడడం ప్రారంభించాను. వచ్చే ఏడాది నాకు 35 సంవత్సరాలు. బ్యాడ్మింటన్ లో నేను ఎక్కువ కాలం కెరీర్ కెరీర్ కొనసాగించాను. ఈ విషయంలో నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం చివరి నాటికి నా రిటైర్మెంట్ పై నిర్ణయం తీసుకుంటాను". అని సైనా చెప్పుకొచ్చింది.
ALSO READ | పతక ‘ప్రీతి’.. పారాలింపిక్స్‌లో మరో కాంస్యం గెలిచిన స్టార్ స్ప్రింటర్
ప్రస్తుతం సైనా వయసు 34 సంవత్సరాలు. బ్యాడ్మింటన్ లో నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. 2012 లండన్ ఒలింపిక్స్ లో కాంస్యం పతకం గెలుచుకొని ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ షట్లర్ గా నిలిచింది. 2010, 2018 కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణ పతకం గెలుచుకుంది. ఆ తర్వాత గాయాలతో ఆమె కెరీర్ దిగ్గజారుతూ వచ్చింది.