ఏపీలో ఎన్నికల ప్రచారంలో పార్టీలు స్పీడ్ పెంచాయి. గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీచేస్తున్న సంగతి తెలిసిందే.. దీంతో పవన్ కు మద్దతుగా మెగా ఫ్యామిలీ ముమ్మరంగా ప్రచారం చేస్తోంది. ఈ క్రమంలో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ మే 5న కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత నెలకొంది.
తేజ్ కాన్వాయ్ పై ఎవరో గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరారు. దీంతో సాయిధరమ్ తేజ్ పక్కన ఉన్న తాటిపర్తికి చెందిన జనసైనికుడు నల్లల శ్రీధర్ తీవ్రంగా గాయపడ్డారు. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
పవన్ కళ్యాణ్ కు మద్దతుగా సాయిథరమ్ తేజ్ ప్రచారం చేస్తున్నారని స్థానికి గజ్జాలమ్మ కూడలికి భారీగా చేరుకున్నారు జనసైనికులు అక్కడ సమీపంలో ఉన్నా వైసీపీ వర్గీయులు జగన్ కు మద్దతుగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. సాయిదరమ్ తేజ్ చినజగ్గంపేటకు వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి కాన్వాయ్ పై రాయి విసిరారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వైపీసీ నేతలు ప్లాన్ ప్రకారమే చేశారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు.