నదియాడ్ వాలాతో అమెజాన్ ప్రైమ్ వీడియో జట్టు

ప్రముఖ బాలీవుడ్ చిత్ర నిర్మాత సాజిద్ నదియాడ్ వాలాకు చెందిన ‘నదియాడ్ వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్’(ఎన్జీఈ) సంస్థతో  అమెజాన్ ప్రైమ్ వీడియో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆ బ్యానర్ లో తదుపరిగా విడుదల కాబోయే 6 సినిమాలకు సంబంధించిన  లైసెన్సింగ్ ను  అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఆ సినిమాల జాబితాలో బవాల్, సంకీ, బాగీ 4 సహా మరో మూడు మూవీస్ ఉన్నాయి. ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియో అందుబాటులోకి తెచ్చిన ‘ఎర్లీ యాక్సెస్ రెంటల్’ ఫీచర్ ద్వారా ఈ  సినిమాలను వినియోగదారులకు అందుబాటులోకి తెస్తారు. దీంతో థియేటర్ లో మూవీ విడుదలైన వెంటనే అమెజాన్ ప్రైమ్ వీడియోలోని  ‘ఎర్లీ యాక్సెస్ రెంటల్’ ఫీచర్ ద్వారా  చూసే వీలు కలుగుతుంది. ఎన్జీఈ నిర్మిస్తున్న ఆ ఆరు సినిమాల్లో వరుణ్ ధావన్, టైగర్ ష్రాఫ్, కార్తీక్  ఆర్యన్,  అహాన్ శెట్టి సహా పలువురు ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.  

మరిన్ని వార్తలు..

పుతిన్ మూడేళ్లకు మించి బతకడం కష్టమే ?

సివిల్స్లో మెరిసిన తెలుగు తేజాలు