చంద్రబాబు జనం నాయకుడు కాదు.. పార్టీని కబ్జా చేసి వచ్చారు: సజ్జల రామకృష్ణారెడ్డి

తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీగా అర్హత కోల్పోయిందన్నారు.  చంద్రబాబు జనంలో నుంచి వచ్చిన నాయకుడు కాదని... పార్టీని కబ్జా చేసి వచ్చారని   సోమవారం ( ఏప్రిల్​ 22)  తాడేపల్లిలో మీడియా సమావేశంలో తెలిపారు.  చంద్రబాబుకు ప్రజలకు ఏమీ తెలియదన్న సజ్జల... లాస్ట్​ ఛాన్స్​ కూడా జారిపోతుందని ఆయనకు అర్దమయిందని.. అందుకే అందర్నీ తిడుతూ తిరుగుతున్నారని విమర్శించారు. 

2014లో చంద్రబాబు, పవన్​, మోదీ ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు.  టీడీపీ అండ్​ కో పార్టీలకు  పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరకడం లేదు కాబట్టే.... టీడీపీ పార్టీ వారిని జనసేనలోకి పంపించి పోటీ చేయించే దుస్థుతిలో ప్రస్తుతం చంద్రబాబు ఉన్నారన్నారు.  వైసీపీ నుంచి జనసేనలోకి వెళ్లిన వరప్రసాద్​ ను అక్కడి నుంచి బీజేపీలోకి వెళ్తే టిక్కెట్​ ఇచ్చారన్నారు.  ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులను చంద్రబాబు అండ్​ కో టీం మార్చుతుందన్నారు.  జనసేనకు కేటాయించిన సీట్లలో కూడా టీడీపీ వారే పోటీచేస్తున్నారని.. ఈ లెక్కన చూస్తే జనసేనకు పది సీట్లే కేటాయించారన్నారు. 

పిఠాపురం నుంచి కూడా పవన్​ పోటీ నుండి తప్పుకోవచ్చేమో అని అనుమానం వ్యక్తం చేశారు.  రాష్ట్రమంతా ప్రచారం చేయాలనే సాకు చూపించి పవన్​ బరిలో నుంచి వెళ్లిపోయే అవకాశం ఉందని తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. నామినేషన్ల పర్వం ముగుస్తున్నా.. టీడీపీ కూటమిలో  సీట్లను సర్దుబాటు చేసుకోలేక తికమకపడుతున్నారన్నారని సజ్జల అన్నారు.