ఎన్నికల్లో డీపీ దుష్ట పన్నాగం పన్నిందని సజ్జల తెలిపారు. పల్నాడు జిల్లాలో టీడీపీ నేతలు పేట్రేగిపోయారన్నారు. టీడీపీ గూండాలు విచ్చలవిడిగా దాడులు చేశారన్నారు, ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని.. వైసీపీ నేతలు, కార్యకర్తలు చాలా ప్రశాంతంగా ఉన్నారన్నారు. పల్నాడు జిల్లాలో టీడీపీ ఏకపక్షంగా దాడులకు పాల్పడిందన్నారు. టీడీపీ నేతలు రెచ్చగొట్టినా... వైసీపీ నేతలు సంయమనం పాటించారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. టీడీపీ కవ్వింపు చర్యలకు పాల్పడిందన్నారు. అధికారంలో ఉన్నా మాపై దాడి చేశారంటూ.. అడ్డగోలు పొత్తులు.. దాడులతో రాజకీయం చేశారని టీడీపీ కూటమి నేతలను విమర్శించారు. బూతులతో వ్యక్తిగత దాడులకు పాల్పడ్డారన్నారు. కొన్ని ప్రాంతాల్లో విపక్షాల నేతలు దాడులకు బరి తెగించారన్నారు. అధికారం అండగా ఉంటుందని బీజేపీతో పొత్తు పెట్టుకున్నారన్నారు.
ఎన్నికలకు ఒక రోజు ముందు కూడా బదిలీలు జరిగాయన్నారు. జగన్ తో పోటీపడే శక్తిలేని చంద్రబాబు కృత్రిమ ఎజెండాను ప్రజలు నమ్మలేదన్నారు. కుప్పంలో పలు పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ నేతలు రిగ్గింగ్ కు పాల్పడ్డారన్నారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేశామని.. రీపోలింగ్ జరపాలని ఈసీకి కోరామన్నారు.
ఏపీ ప్రజలు ఎప్పుడూ లేని విధంగా ప్రజలు సానుకూల ఓటుతో క్యూలో నిల్చున్నారన్నారు. ఎవరికి ఓటేయాలో ప్రజలు ముందుగానే నిర్ణయానికి వచ్చారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మహిళల ఆశీస్సులు వైసీపీకే ఉన్నాయంటూ... ప్రభుత్వ సానుకూల ఉప్పెనలా కనిపించిందన్నారు. 2019లో 79 శాతం పోలింగ్ నమోదైందంటూ .. సీఎం జగన్ పేదల కోసం సీఎం జగన్ ఎంతో చేశారన్నారు.