జగన్ వద్దన్నా షర్మిల వినలే.. ఆమె పార్టీతో వైసీపీకి సంబంధం లేదు

తెలంగాణలో కొత్త పార్టీ గురించి మూడు నెలలుగా చర్చలు జరుగుతున్నాయన్నారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి. తెలంగాణలో పార్టీ పెడితే వచ్చే నష్టాల గురించి షర్మిలకు జగన్ చెప్పారన్నారు. ఇప్పటికైతే అక్కడకు పోవాలనే ఆలోచనలు లేవన్నారు. జగన్ ,షర్మిల మధ్య విభేదాలు లేవు కానీ  భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి..తెలంగాణలో ఎందుకు జరగకూడదనేది ఆమె అభిప్రాయమని..ఆమె ఆలోచనలకు వైసీపీకి ఎలాంటి సంభందం లేదన్నారు. ఆమె సొంతంగా ఒక ప్రయత్నం చేయాలనుకుంటున్నారన్నారు. షర్మిల వైసీపీ లైన్ దాటారన్నారు. షర్మిల కొత్త పార్టీకి వైసీపీకి సంబంధం లేదన్నారు. షర్మిలకు ,జగన్ కు వ్యక్తిగత విభేదాలు లేవన్నారు. పార్టీలో షర్మిలను ఎదగనివ్వకపోవడమనేది ఏమి లేదన్నారు. జగన్ సహకరించారు కాబట్టే షర్మిల పాదయాత్ర చేశారన్నారు. తెలంగాణ వెళ్లి ఏ ప్రయత్నం చేసినా గ్యాప్ వస్తుందని జగన్ భావించారని..అందుకే  పార్టీ కార్యకలాపాలు వద్దని  చెప్పారన్నారు.

తెలంగాణాలో మా పార్టీ ఎలా ఉండాలో ఆలోచనలు నడుస్తున్నాయన్నారు. అక్కడ వైఎస్సార్ అభిమానుల ఆకాంక్షలు చాలా ఉన్నాయన్నారు.  రెండు రాష్ట్రాలు సమన్వయంతో, సహకారంతో చేయాల్సినవి చాలా ఉన్నాయన్నారు.  ఈ నేపథ్యంలో అక్కడికి వెళితే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని షర్మిలకు వద్దని చెప్పారన్నారు.