
వారాహి యాత్రలో ప్రభుత్వంపై విరుచుకుపడుతోన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కౌంటర్ ఎటాక్‌కు దిగారు అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. పవన్ ది రాజకీయ యాత్ర కాదని కుల యాత్రంటూ.. ఆయనొక పెయిడ్ ఆర్టిస్టే కానా అసలు రాజకీయ నాయకుడే కాదన్నారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. సినిమాల్లో డైరక్టర్ చెప్పినట్లు చేసే పవన్.. రాజకీయాల్లో చంద్రబాబు స్క్రిప్ట్ ను బహిరంగసభల్లో ప్రసంగిస్తున్నారని ఎద్దేవా చేశారు. ముద్రగడ పద్మనాభం తన కులం కోసం గట్టిగా నిలబడిన వ్యక్తి.. ఆ కృషిని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదన్న ఆయన.. ముద్రగడ నిజాయితీ గల వ్యక్తి.. మా పార్టీ విధానాలు నచ్చి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాం అన్నారు. కానీ, ముద్రగడను ఎవరైనా కంట్రోల్ చేయగలరు అనుకోవటం అమాయకత్వం అవుతుందన్నారు.
టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టోను చూసి జనాలు నవ్వుకుంటున్నారన్నారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రి చేయటం కోసమే పని చేస్తున్నాడనేది పవన్ మాటలను బట్టి అర్థం అవుతోందన్న ఆయన.. టీడీపీ, పవన్ కల్యాణ్.. వాళ్ల మీడియా అజెండా అంతా ఒకే చోట తయారు అవుతుందని విమర్శించారు.. ఒక స్కీం ప్రకారం ఇది జరుగుతోందన్నారు. పవన్ కల్యాణ్ బస్సు యాత్ర కులం అంశంపై నే చేస్తున్నారని స్పష్టం అవుతుందని ఆరోపించారు. కులాన్ని వాడుకోవడం ,కులాలమద్య చిచ్చు పెట్టడమే చంద్రబాబు లక్ష్యమని ..దీనిని ప్రజలు హర్షించరని సజ్జల విమర్శించారు.