వారం రోజుల తరువాత రాష్ట్రానికి టీడీపీ పీడ విరగడ అవుతుంది: సజ్జల

ప్రభుత్వ పథకాల లబ్ధిదారులే వైసీపీకి రెండోసారి విజయం కట్టబెడుతున్నారని చెప్పారు సజ్జల. సీఎం జగన్ పాలనకు ఏపీ ప్రజలు 100కు 200 వందల మార్కులు వేశారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.  వారం రోజుల తర్వాత రాష్ట్రానికి టీడీపీ పీడ విరగడవుతుందని పేర్కొన్నారు ఈసీ ... చంద్రబాబు వైరస్‌తో ఇన్ఫెక్ట్ అయిందంటూ సజ్జల మండిపడ్డారు.  ఫలితాల ముందు తాత్కాలిక ఆనందాలకు తాము వెళ్లడం లేదని సజ్జల తెలిపారు. ఇక, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు తమకే పడ్డాయని.. టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారంటూ మండిపడ్డారు..  బీజేపీతో చంద్రబాబు పొత్తు తర్వాత ఆయనకు అనుకూలంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తుందని ఆరోపణలు గుప్పించారు. 

Also read :  పిఠాపురంలో స్టిక్కర్ల వార్.. మాములుగా లేదుగా.. రచ్చ రచ్చే

మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీ ప్రభుత్వమే. జూన్ 9న రెండోసారి సీఎంగా జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఉంటుంది. అందులో ఎలాంటి అనుమానం లేదని ఆయన అన్నారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో కౌంటింగ్ చీఫ్ ఏజెంట్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సజ్జల పాల్గొని కౌంటింగ్ ఏజెంట్లకు దిశానిర్దేశం చేశారు.  ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం కౌంటింగ్ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.

కౌంటింగ్ జరిగేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అవతల పార్టీ వాళ్ల ఆటలు సాగనివ్వకుండా జాగ్రత్తగా ఉండాలి. కచ్చితంగా మళ్లీ మనమే అధికారంలోకి వస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం మరోసారి ఏర్పాటవుతుంది. జూన్ 9న ప్రమాణ స్వీకారం ఉంటుంది. అందులో ఎలాంటి అనుమానం లేదని సజ్జల రామకృష్ణా రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.