ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న వేళ ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద రాజకీయ దుమారం రేగుతోంది. ఈ యాక్ట్ ద్వారా సీఎం జగన్ ప్రజల భూములను దోచుకునే కుట్ర చేస్తున్నారని, ప్రజల భూములను తాకట్టు పెడతారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇది కేంద్రం ప్రతిపాదించిన యాక్ట్ అని, ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేదని అధికార వైసీపీ కౌంటర్ ఇస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు బరితెగించి అబద్దాలు ఆడుతున్నారని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తన్నారని అన్నారు. ఇది బీజేపీ చేసిన చట్టమని, నీటి ఆయోగ్ తయారు చేసిన డ్రాఫ్ట్ యాక్ట్ అని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రశ్నించాల్సింది తమను కాదని, బీజేపీని అడగాలని అన్నారు. ఇంతలా అబద్దాలు ఆడే చంద్రబాబుకు రాజకీయాల్లో కొనసాగే అర్హత ఉందా అని అన్నారు సజ్జల.