టీడీపీకి షాక్: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సంచలన వీడియోతో సజ్జల కౌంటర్.. 

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఏపీలో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరిన క్రమంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాజకీయ దుమారం రేపుతోంది. ఈ అంశంపై వైసీపీ చేసిన ఫిర్యాదు మేరకు సీఐడీ విచారణకు ఆదేశాలిచ్చింది ఈసీ. ఇదిలా ఉండగా, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వీడియోతో టీడీపీకి కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని మెచ్చుకుంటూ మాట్లాడిన వీడియోను బయటపెట్టారు.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రెస్ మీట్ పెట్టిన సజ్జల టీడీపీకి కౌంటర్ ఇస్తూ ఈ వీడియోను బయటపెట్టారు. సదరు వీడియోను వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్కులేట్ చేస్తున్నారు. ఎన్నికల వేళ బాబు, లోకేష్ లపై సీఐడీ కేసులు ఒక షాక్ అయితే, ఇప్పుడు ఈ వీడియో బయటపడటం మరొక షాక్ అని చెప్పాలి.