
ఎలోన్ మస్క్పై JSW గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి.టెస్లా బాస్ ఎలాన్మస్క్ భారత ఆటోమేకర్లతో పోటీ పడలేరని అన్నారు.ఎలాన్ మస్క్ టెస్లా కార్లు ఇండియాలోకి వస్తే భారత మార్కెట్‌కు పెద్దదెబ్బ అని వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. అలాంటిదేం జరగదు..ఇది ఇండియా.. భారతీయులకు మహీంద్రా, టాటా లాంటి దిగ్గజాలు చేయగలిగింది..ఎలాన్ మస్క్ ఉత్పత్తి చేయలేడు..అది సాధ్యంకాదు అని జిందాల్ చెప్పడం సంచలనంగా మారింది. ఇంటర్నెట్లో ఇదే హాట్ టాపిక్..
EY ఎంటర్ ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల కార్యక్రమంలో సజ్జన్ జిందాల్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎలాన్ మస్క్ అమెరికాలో అనేక విజయాలు సాధిం చారు..ట్రంప్కు కూడా ఆ ఘనతను సాధించిపెట్టాడు..ఎలాన్ మస్క్ సూపర్స్మార్ట్..ఎలాంటి సందేహం లేదు..అతనో ఇండిపెండెంట్..అంతరిక్షంలో అనేక విజ యాలు అందుకున్నారు. అయితే భారత్లో ఎలాన్ మస్క్ విజయం సాధించడం అంత తేలికైన పనికాదు అని సజ్జన్ జిందాల్ అన్నారు.
జిందాల్ వాదనపై సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అవును నిజమే అని సజ్జన్ జిందాల్ మాటలను కొందరు సమర్ధిస్తే.. మరికొందరు విమర్శించారు. దీంతో సోషల్ మీడియాలో ఎలాన్ మస్క్ టెస్లా కార్లు ఇండియాలో ఎంట్రీపై పెద్ద చర్చకు దారితీసింది.
కొంతమంది వినియోగదారులు జిందాల్ అభిప్రాయాలతో ఏకీభవించారు. టెస్లా చాలా ఖరీదైనది. మాస్ మార్కెట్కు ఇది సరిపోదు.. ఇండియాలోకి టెస్లా కార్లు వస్తే.. ఇండియన్ ఆటోమేకర్స్ కూడా సామర్థ్యాలను పెంచుకుంటారు. ఖచ్చితంగా టాటా ,మహీంద్రాలకే మా సపోర్టు ..ఇండియాలో టెస్లా ఒక చిన్న మార్కెట్ మాత్రమే అవుతుంది" అని ఓ యూజర్ అన్నారు.
మరొక యూజర్ స్పందిస్తూ గత అనుభవాలను ముందలేశారు. ‘‘జనరల్ మోటార్స్, ఫోర్డ్ తమ వ్యాపారాన్ని ఇండియాలో మూసేసిన విషయం తెలిసిందే.. కార్ల మార్కెట్ విషయానికొస్తే భారతీయులు జపాన్ లేదా దక్షిణ కొరియా వంటి ఆసియా కార్లతో ఎక్కువగా ఇష్టపడతారు. కానీ అమెరికా లేదా యూరప్‌తో కాదు’’ అని వినియోగదారులలో ఒకరు జోడించారు.
అయితే కొందరు యూజర్లు ఎలాన్ మస్క్ పై గట్టి నమ్మకంతో ఉన్నారు. ‘‘దశాబ్దం క్రితం అమెరికా పారిశ్రామికవేత్తలు, వాహన తయారీదారులు ,నాసా కూడా ఎలాన్ మస్క్ పై ఇదే విమర్శలు చేశారు. ఎన్ని ఎదురు దెబ్బలు ఎదురైనా మస్క్ అవిశ్రాంతంగా తమ లక్ష్యాలను సాధించే వ్యక్తి ఎలాన్ మస్క్’’ అంటూ ఓ యూజర్ రాశాడు. తీర్మానాలు చేసే ముందుకు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలంటూ సలహా ఇచ్చారు.
ALSO READ : క్రిప్టో కరెన్సీ దశ-దిశ మార్చే నిర్ణయం.. బిట్కాయిన్ రిజర్వ్ ఏర్పాటు ఆర్డర్పై ట్రంప్ సంతకం
ఇండియాలో టెస్లా
ఇటీవల ఇండియాలో రెండు ప్రాంతాల్లో టెస్లా కార్ల షోరూమ్ లను ఏర్పాటు చేసేందుకు ఎలాన్ మస్క్ సిద్దమయ్యారు. ముంబైలో ఒక షోరూం కోసం టెస్లా లీజు ఒప్పందంపై సంతకం చేసిన చేసిన తర్వాత జిందాల్ ప్రకటన వచ్చింది. ఫిబ్రవరి 16, 2025 నుంచి ప్రారంభమయ్యే ఐదు సంవత్సరాల లీజును ఈ కార్ల తయారీ సంస్థ పొందింది. టెస్లా న్యూఢిల్లీ, ముంబైలలో షోరూమ్ స్థానాలను కూడా గుర్తించింది. గతేడాది అమెరికాలో ఎలోన్ మస్క్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిసిన తర్వాత ఈ పరిణామం జరిగింది.