హైదరాబాద్:బస్సులో గుండెపోటు వచ్చిన ప్రయాణికుడికి సీపీఆర్ చేసి ఆస్పత్రికి తరలించిన తమ సిబ్బందిని TGSRTC ఎండీ సజ్జనార్ అభినందించారు. హైదరాబాద్ బస్ భవన్లో జీడీమెట్ల
డిపోకు చెందిన కండక్టర్ అంజలి, డ్రైవర్ సైదులును సన్మానించారు ఎండీ వీసీ సజ్జనార్.
బస్సులో గుండెపోటు వచ్చిన ప్రయాణికుడికి సీపీఆర్ చేసి ఆస్పత్రికి తరలించిన తమ సిబ్బందిని #TGSRTC యాజమాన్యం అభినందించింది. హైదరాబాద్ బస్ భవన్లో శనివారం జీడిమెట్ల డిపోనకు చెందిన కండక్టర్ అంజలి, డ్రైవర్ సైదులును ఉన్నతాధికారులతో కలిసి ఎండీ వీసీ సజ్జనర్ ఘనంగా స… pic.twitter.com/vU83HrDJMf
— VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) September 21, 2024
శుక్రవారం(సెప్టెంబర్22) జీడిమెట్ల డిపోకు చెందిన 192/1 రూట్ నంబర్ బస్సు బాలానగర్ నుంచి బహదూర్ పల్లి వైపుకు వెళ్తుండగా.. చింతల్ ఐడీపీఎల్ బస్ స్టాప్ వద్దకు రాగానే మురళి కృష్ణ అనే ప్రయాణికుడికి గుండెపోటుకు వచ్చింది. ఈ విషయాన్ని గమనించిన కండక్టర్ అంజలి, డ్రైవర్ సైదులు అప్రమత్తమై బస్సు ఆపారు. మురళికృష్ణకు సీపీఆర్ చేశారం. అనంతరం 108అంబులెన్స్ ఆస్పత్రికి తరలించారు.
సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రయాణికుడికి సీపీఆర్ చేసి ఆస్పత్రికి తరలించిన కండక్టర్ అంజలీ, డ్రైవర్ సైదులును టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మెచ్చుకున్నారు. ఆపద సమయంలో సేవా గుణాన్ని ప్రదర్శించడం గొప్ప విషయం అన్నారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడంతోపాటు,వారిని ఆపద సమయంలో మేమున్నామని భరోసా కల్పిస్తున్నారని సజ్జనార్ అన్నారు.