కరీంనగర్ సిటీ, వెలుగు: కరీంనగర్ కిమ్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ ఫుడ్ సైన్స్ విద్యార్థులు హైదరాబాద్‌లో వివిధ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ పూర్తి చేసుకున్నారు. దీనికి సంబంధించిన సర్టిఫికేట్లను మంగళవారం స్కూల్లో జరిగిన కార్యక్రమంలో కిమ్స్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ పెరియాల సాకేత్ రామారావు విద్యార్థులకు అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఫుడ్ సైన్స్, న్యూట్రిషన్ డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఏటా వివిధ కంపెనీ లు, హాస్పిటళ్లలో ఇంటర్న్షిప్స్ ఇప్పిస్తూ ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామన్నారు. ప్రిన్సిపాల్ అర్జున్ రావు, హెచ్‌వోడీ మహేశ్, లెక్చరర్స్ పాల్గొన్నారు .