
సిద్దిపేట రూరల్, వెలుగు: వేసవిలో మూగ జీవాలను, పక్షులను కాపాడడానికి స్టూడెంట్స్ చొరవ తీసుకోవాలని స్టూడెంట్ ఫర్ డెవలప్మెంట్జిల్లా కన్వీనర్ ఝాన్సీ అన్నారు. మంగళవారం సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లో సకోర అభియాన్ పేరుతో మూగజీవాలు, పక్షుల దాహం తీర్చేందుకు చెట్లకు మంచినీటితో కూడిన మట్టి పాత్రలను ఏర్పాటు చేసే కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్టూడెంట్ ఫర్ డెవలప్మెంట్కొమరంభీం ఆశయాలు కొనసాగిస్తూ జల్, జంగల్, జమీన్, జాన్వర్, జన్ కోసం పనిచేస్తోందన్నారు. నగర కన్వీనర్ ఝాన్సీ, ఎస్ఎఫ్ డీ కో కన్వీనర్ వైష్ణవి, ఏబీవీపీ సిద్దిపేట జిల్లా కన్వీనర్ ఆదిత్య, లక్ష్మీపతి, ఫణిందర్, పరశురాం, హరికృష్ణ, అనీశ్, ముని, మహిపాల్, కార్తీక్, ప్రణయ్ పాల్గొన్నారు.