నాగబాబు విలన్‌‌‌‌గా మూవీ..రిలీజ్‌‌‌‌ డేట్‌‌‌‌ ఫిక్స్

సూపర్‌‌‌‌స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి రాబోతున్న మరో హీరో శ‌‌‌‌రణ్ కుమార్. శరణ్, జాన్వీర్ కౌర్ జంటగా  శివ కేశన కుర్తి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సాక్షి’. మునగాల సుధాక‌‌‌‌ర్ రెడ్డి నిర్మాత. జులై 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలియజేశారు. 

ఈ సందర్భంగా రిలీజ్ డేట్‌‌‌‌ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను లాంచ్ చేసిన దర్శకుడు వి వి వినాయక్ సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. ఇందులో నాగబాబు విలన్‌‌‌‌గా కనిపించబోతున్నారు. అజయ్, ఇంద్రజ, ఆమని ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.  భీమ్స్ సిసిరీలియో సంగీతం అందిస్తున్నాడు.