ఏజెంట్(Agent) సినిమాతో తెరంగేట్రం చేసిన లేటెస్ట్ బ్యూటీ సాక్షి వైద్య(Sakshi vaidya) బంపర్ ఆఫర్ కొట్టేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) హీరోగా వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagathsingh) సినిమాలో నటించే అవకాశం దక్కించుకుందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఆమె హీరోయిన్ గా నటిస్తున్న రెండో సినిమా గాండీవధారి అర్జున(Gandeevadhari Arjuna). మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun tej) హీరోగా వస్తున్న ఈ మూవీని స్టైలీష్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు(Pravin sattaru) తెరకెక్కిస్తున్నారు ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే తాజా సమాచారం మేరకు ఈ బ్యూటీ తాజాగా పవన్ కళ్యాణ్ తో నటించే చాన్స్ పట్టేసిందట. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్(Harush shankar) దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రెండో హీరోయినా కోసం చాలరోజులుగా మేకర్స్ వెతుకుతూనే ఉన్నారు. అందుకోసం చాలా అషన్స్ కూడా చూశారు కానీ ఫైనల్ గా ఆ అవకాశం లేటెస్ట్ బ్యూటీ సాక్షి వైద్యకి దక్కిందని సంచారం. ఇక ఈ సినిమాలో ఇప్పటికే శ్రీలీల(Sreeleela) నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఓ షెడ్యూల్ ను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఉస్తాద్ మూవీ రెండో షెడ్యూల్ సెప్టెంబర్ 5 నుండి మొదలుకానుంది. ఈ షెడ్యూల్ లో సాక్షి వైద్య పాల్గొననుందని సమాచారం. వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.