ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సలార్- పార్ట్ వన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ ల సునామీ సృష్టిస్తుంది. భారీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఈ సినిమా గత 11 రోజులుగా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది. అందరి అంచనాలను దాటి చిత్రం ప్రక్షేకుల మదిని గెలుచుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 650 కోట్లు కలెక్ట చేసే దిశగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే సలార్ పార్ట్ వన్ రూ. 625 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించింది. వీకెండ్ డేస్, న్యూ ఇయర్ అన్ని కలిసి రావడంతో దేశ వ్యాప్తంగా రెండు రోజుల్లోనే రూ. 15 కోట్లు కలెక్ట్ చేసింది. ఇలాగే ముందుకెళ్తే 650 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
పెద్దగా ఢీ కొనలేక పోయిన షారుఖ్ సినిమా..
కాగా, డిసెంబర్ 22న ప్రభాస్ సలార్ పార్ట్ 1 భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైంది. బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ డంకీ సినిమా కూడా అదే రోజు విడుదలై సలార్ కు గట్టి పోటీగా వచ్చింది. కానీ అది అనుకున్నంత ప్రభావితం చూపకపోవడంతో సలార్ సినిమాకు కలెక్షన్ ల వరద వచ్చింది. 'సాలార్' ప్రపంచ వ్యాప్తంగా కేవలం 11 రోజుల్లోనే రూ.625 కోట్లు రాబట్టడంతో బాక్సాఫీస్ వద్ద తిరుగులేని పరిస్థితి కనిపిస్తోంది. దేశీయ బాక్సాఫీస్ వద్ద రూ.360.77 కోట్లు కలెక్ట్ చేసి తన సత్తా చూపించింది. 'సాలార్' జనవరి 1న 48.75 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది.
భారీ బడ్జెట్ తో సెకండ్ పార్ట్
సలార్ పార్ట్ వన్ అనున్నదాని కంటే భారీగా హిట్ అవ్వడంతో మేకర్స్ పార్ట్ 2 మీద దృష్టి సాధించారు. రెండవ భాగానికి సాలార్: పార్ట్ 2 - శౌర్యంగ పర్వం' అని పేరు పెట్టారు. సీక్వెల్ షూటింగ్ ఇంకా మొదలు కాలేదని దర్శక నిర్మాతలు పలుమార్లు చెప్పారు. ఇప్పటికే హొంబలే ఫిలిమ్స్ వారు భారీ బడ్జెట్ కు పెట్టిన పేరుగా వ్యవహరిస్తున్నారు. ఈ రేంజ్ లో పార్ట్ వన్ హిట్ అయ్యింది కాబట్టి పార్ట్ 2ను రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నట్టు ఫిలింనగర్ వ్యాప్తంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి దీని పై మేకర్స్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.