
టాలీవుడ్ స్టార్ హీరో డార్లింగ్ ప్రభాస్ సినిమాలకి పాన్ ఇండియా రేంజ్ లో మంచి క్రేజ్ ఉంది. దీంతో ప్రభాస్ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ చాలా షాగా ఎదురు చూస్తుంటారు. అయితే 2023లో రిలీజ్ అయిన సలార్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాకి కన్నడ ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించగా హోంబలే ఫిలిమ్స్ నిర్మించింది. మలయాళ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్, శ్రీయా రెడ్డి, బాబీ సింహ, ఈశ్వరి, శృతి హాసన్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.
ఐతే ఈ సినిమా రిలీజ్ అయ్యి ఏడాది గడిచినప్పటికీ ఇంకా ఇప్పటికీ జియో హాట్ స్టార్ లో టాప్ 10 సినిమాల్లో ఒకటిగా ట్రెండ్ అవుతోంది. అయితే తెలుగు, తమిళ, మలయాళ వెర్షన్స్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యాయి. దీంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ముఖ్యంగా కొన్ని సలార్ సినిమాలోని కొన్ని సీన్స్ ని షేర్ చేస్తూ ట్రెండింగ్ చేస్తున్నారు. దీంతో సలార్ పార్ట్ 2: శౌర్యంగా పర్వ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సలార్ పార్ట్ 2 షూటింగ్ దాదాపుగా పూర్తయింది. త్వరలోనే టీజర్ రిలీజ్ అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ప్రభాస్ దాదాపుగా 4 బిగ్ బడ్జెట్ సినిమాలతో బిజిబిజీగా గడుపుతున్నాడు. ఇందులో ఇప్పటికే "ది రాజాసాబ్" సినిమా 80% శాతం షూటింగ్ పూర్తి చేసుకోగా కల్కి 2898 AD ఈ ఏడాది సెప్టెంబర్ లో సెట్స్ మీదకి వెళ్లనుంది. అలాగే స్పిరిట్, ఫౌజి, సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి. దీంతో ఈ రెండు సినిమాలకంటే ముందుగా రాజాసాబ్ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.