Salaar Re Release: ప్రభాస్ vs పవన్ కళ్యాణ్.. సలార్ రీ-రిలీజ్ డే 1 అడ్వాన్స్ బుకింగ్స్లో టాప్ ఎవరు?

Salaar Re Release: ప్రభాస్  vs పవన్ కళ్యాణ్.. సలార్ రీ-రిలీజ్ డే 1 అడ్వాన్స్ బుకింగ్స్లో టాప్ ఎవరు?

ప్రభాస్ నటించిన సలార్ పార్ట్ 1 నేడు (మార్చి 21,2025న) థియేటర్లలో రీ రిలీజ్ అయింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన యాక్షన్-ప్యాక్డ్ బ్లాక్‌బస్టర్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ మళ్ళీ చూడాలని ఎదురుచూస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ దృష్ట్యా సలార్ పార్ట్ 1 థియేటర్లలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. 

తాజా అప్‌డేట్ ప్రకారం, సలార్ మూవీ ఫస్ట్ డే 1.46 కోట్ల గ్రాస్ (బ్లాక్ చేయబడిన సీట్లు మినహా) అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంది. దక్షిణ భారతదేశం అంతటా 840 షోల నుండి దాదాపు 1.15 లక్షల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సలార్ కి ఎక్కువ టికెట్లు తెగాయి. అందులో తెలంగాణలో 68 లక్షలు, ఆంధ్రప్రదేశ్ లో 59 లక్షలు మరియు కర్ణాటకలో 19 లక్షల మేరకు అడ్వాన్స్ బుకింగ్స్ జరగాయి. దీంతో ప్రభాస్ వర్సెస్ పవన్ కళ్యాణ్ గా మారింది.

సలార్ vs గబ్బర్ సింగ్:

పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ మూవీ ఇండియా రీ-రిలీజ్లో హయ్యెస్ట్ ఓపెనింగ్ నమోదు చేసుకుంది. దాదాపు 1.40 లక్షల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. దాంతో ఫస్ట్ డే దాదాపు 2.09 కోట్ల గ్రాస్ (బ్లాక్ చేయబడిన సీట్లు మినహా) ప్రీ-సేల్స్ అయ్యాయి. ఇక ఇప్పుడు గబ్బర్ సింగ్తో పోల్చితే, సలార్ ప్రస్తుతం 30% తక్కువగా ఉంది.

హైదరాబాద్ ప్రీ-సేల్స్‌లో మురారి నంబర్ 1 స్థానం:

ఇకపోతే సలార్ హైదరాబాద్‌లో 55 లక్షల గ్రాస్ అడ్వాన్స్ బుకింగ్‌ను నమోదు చేసుకుంది. ఇది సలార్కు అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ హయ్యెస్ట్ సిటీ అయినప్పటికీ, మహేష్ బాబు మురారి కంటే ఇది చాలా వెనుకబడి ఉంది. మురారి సినిమా హైదరాబాద్ లోనే 1.50 కోట్ల ప్రీ-సేల్స్ వసూలు చేసింది. గబ్బర్ సింగ్ 1.30 కోట్లకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ సాధించింది.