
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శ్రీనివాసుడి దర్శనం కోసం 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఏప్రిల్ 2న వేంకటేశ్వరుడిని 82,398 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,076 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.4 కోట్లు సమకూరిందని టీటీడీ వెల్లడించింది.
మరోవైపు తిరుమలలో సాలకట్ల వసంతోత్సవాలు ఇవాళ్టి నుంచి మొదలయ్యాయి. ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ నెల 5 వరకూ స్వామివారికి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ నిర్వహించనున్నట్టు టీటీడీ వెల్లడించింది. ఈ క్రమంలోనే ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవను రద్దు చేయనున్నట్టు టీటీడీ తెలిపింది.