
- మైకెల్ పేజ్ రిపోర్ట్
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఉద్యోగుల జీతాలు 6 శాతం నుంచి 15 శాతం మేర పెరగొచ్చని రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ మైకెల్ పేజ్ ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. సెక్టార్ బట్టి జీతాల పెంపులో తేడా ఉంటుందని తెలిపింది.
టాప్ లెవెల్ స్కిల్స్ ఉన్నవారి శాలరీలు 40 శాతం వరకు కూడా పెరగొచ్చని, కీలకమైన లీడర్‌షిప్ రోల్స్‌కు కూడా భారీగా శాలరీ హైక్ ఉంటుందని తన 2025 శాలరీ గైడ్‌లో పేర్కొంది. కిందటేడాదితో పోలిస్తే ఈ ఏడాది జాబ్ మార్కెట్ మెరుగ్గా కనిపిస్తోందని, నియామకాలు పెరుగుతాయని తెలిపింది.
‘ఇండియాలో గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ, సావరిన్, వెంచర్ క్యాపిటల్, రియల్ ఎస్టేట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. తమ బిజినెస్‌ను పెంచుకుం టున్నాయి’ అని మైకెల్ పేజ్ పేర్కొంది.
ఈ రిపోర్ట్ ప్రకారం, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు పెరగడంతో ఏఐ, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా ప్రైవేసీ, క్లౌడ్ కంప్యూటింగ్, ఫుల్‌స్టాక్ డెవలప్‌మెంట్‌కు భారీగా డిమాండ్ ఉంది.