హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీలో మరోసారి నకిలీ ఫింగర్‌ప్రింట్స్ మోసం బయటపడింది. తక్కువ మందితో పనులు చేయించి, ఎక్కువ మంది శాలరీలు నొక్కేస్తున్న ఇద్దరు కాంట్రాక్ట్శానిటేషన్ఫీల్డ్అసిస్టెంట్లను సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. అంబర్‌పేట డివిజన్, సర్కిల్16లో కార్వాన్కు చెందిన శివయ్య ఉమేశ్, ఖైరతాబాద్‌కు చెందిన శివరామ్ కాంట్రాక్ట్శానిటేషన్ఫీల్డ్ అసిస్టెంట్లుగా పని చేస్తున్నారు.
ఇద్దరూ కలిసి యూట్యూబ్‌లో చూసి ఫింగర్ప్రింట్స్క్లోనింగ్చేయడం నేర్చుకున్నారు. మైనం, ఫెవికాల్ఉపయోగించి రెండేండ్లుగా డ్యూటీకి రాని 35 మంది వర్కర్ల నకిలీ ఫింగర్ప్రింట్లను తయారు చేశారు. వాటిని ఉపయోగించి శాలరీలను కాజేస్తున్నారు.