కోల్‌బెల్ట్, వెలుగు : సింగరేణి బొగ్గు గనులు, డిపార్ట్మెంట్లు, ఆఫీసుల్లో పనిచేసే క్లరికల్మహిళా ఉద్యోగులకు సౌలత్లు కల్పించడంలో సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని, వారికి సౌకర్యాలు కల్పించాలని సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ కార్పొరేట్ చర్చల ప్రతినిధి సలెంద్ర సత్యనారాయణ డిమాండ్‌చేశారు. మహిళా ఉద్యోగులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని మందమర్రి, రామకృష్ణాపూర్, బెల్లంపల్లి బ్రాంచిల ఏఐటీయూసీ లీడర్లు శుక్రవారం మందమర్రి ఏరియా సింగరేణి జీఎం మనోహర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ.. మహిళా ఉద్యోగులకు సరైన ఫర్నీచర్, చైర్లు, ప్రింటర్లు, ఫ్యాన్లు, కూలర్లు అందుబాటులో ఉంచడంలేదన్నారు. మందమర్రి ఏరియాలో వేకెన్సీలు లేకపోవడంతో కార్మికుల వారసులను ఇతర ఏరియాలకు బదిలీ చేస్తున్నారని.. వారు ఇతర ఏరియాల్లో పనిచేయలేరని, ఇక్కడే ఉద్యోగాలు కల్పించాలని తమ యూనియన్డిమాండ్మేరకు యాజమాన్యం చర్యలు చేపట్టిందన్నారు. యూనియన్బ్రాంచి సెక్రటరీలు ఆంజనేయులు, దాగం మల్లేశ్, వైస్ప్రెసిడెంట్భీమనాథుని సుదర్శనం, కంది శ్రీనివాస్, సొమిశెట్టి రాజేశం తదితరులు పాల్గొన్నారు.