- 1.79 లక్షల యూనిట్ల సేల్
ముంబై: ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మకాలు ఈ ఏడాది జులైలో 55.2 శాతం వృద్ధితో 1,79,038 యూనిట్లకు చేరుకున్నాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా) డేటా ప్రకారం, జులై 2023లో మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మకాలు 1,16,221 యూనిట్లుగా ఉన్నాయి. గత ఏడాది జులైలో 54,616 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత నెలలో ఎలక్ట్రిక్ టూవీలర్స్ అమ్మకాలు 95.94 శాతం పెరిగి 1,07,016 యూనిట్లకు చేరాయి.
ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ అమ్మకాలు 18.18 శాతం వృద్ధి చెంది 58,873 యూనిట్ల నుంచి 63,667 యూనిట్లకు చేరుకున్నాయి. కమర్షియల్ వెహికల్స్ అమ్మకాలు 364 యూనిట్ల నుంచి 816 యూనిట్లకు పెరిగాయి.