నల్గొండ జిల్లాలో జోరుగా సాగుతున్న నకిలీ విత్తనాల అమ్మకాలు

నల్గొండ జిల్లాలో నకిలీ విత్తనాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. నిండా మునిగామంటూ ఆందోళన చేసినా వ్యవసాయ శాఖ అధికారులు, ఆర్టికల్చర్ అధికారులు రైతులను పట్టించుకోవట్లేదు. దాదాపు 15 రోజులు గడుస్తున్నా నకిలీ సీడ్స్ ఇచ్చిన షాప్ యజమానిపై చర్యలు తీసుకోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ, కనగల్, నిడమనూర్ రెవెన్యూ ప్రాంతాలకు చెందిన రైతులు వాటర్ మిలన్ పంట పూర్తిగా నష్టపోయామంటూ దేవరకొండ రోడ్డులో ఉన్న"  కర్షక్ " మైక్రో ఇరిగేషన్ సిస్టమ్ షాప్ ముందు 15 రోజుల ముందు ఆందోళన చేపట్టారు.  

రైతులకు మోసం జరిగితే ఊరుకునేది లేదని, నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై పీడీ యాక్ట్ పెట్టాలని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. అయినా ఆ నిబంధనలను అధికార యంత్రంగం ఎందుకు పాటించడం లేదంటూ నష్టపోయిన రైతంగం ప్రశ్నిస్తోంది. షాప్ యజమాని రైతులకు అంతో ఇంతో అప్పజెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు రైతులు ఆరోపిస్తున్నారు. నకిలీ సీడ్స్ అమ్మిన యజమాని ఎలాంటి రసీదులు ఇవ్వకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో నకిలీ విత్తనాల అమ్మకాలపై సీరియస్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సీరియస్ అయ్యారు. నష్టపోయిన రైతులకు న్యాయం చేయడంతో పాటు జరిగిన ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని అగ్రికల్చర్, ఆర్టికల్చర్ అధికారులకు ఆదేశించారు.