కరీంనగర్ జిల్లాలో నైట్ మటన్ విక్రయాల జోరు

కరీంనగర్ జిల్లాలో న్యూ ఇయర్ జోష్ కనిపిస్తోంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ కొత్త ఏడాది సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. మందు, మటన్ తో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే మటన్ కు ఫుల్ గిరాకీ ఏర్పడింది. షాపుల ముందు జనం బారులు తీరారు. ఇదే అదునుగా భావించిన మటన్ షాపు యజమానులు ఇష్టమొచ్చినట్టు రేట్స్ పెంచి విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. 

మటన్ రేటు ఎంత ఉన్నా తగ్గేదేలా అంటూ జనం కొనుగోలు చేస్తున్నారు. ఖర్చుకూ ఎక్కడా వెనుకాడటం లేదు. అందుకే మటన్ షాపుల ముందు జనం కిటకిటలాడుతున్నారు. రాత్రి సమయంలో కూడా కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు.