పేరుకుపోతున్న కార్ల నిల్వలు.. జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తగ్గిన అమ్మకాలు

పేరుకుపోతున్న కార్ల నిల్వలు..  జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తగ్గిన అమ్మకాలు

కమర్షియల్ వెహికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పెరగనున్న డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
పడిన ట్రాక్టర్ అమ్మకాలు..పెరిగిన టూవీలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, త్రీవీలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సేల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఫాడా

న్యూఢిల్లీ:  ప్యాసింజర్ వెహికల్స్ (కార్ల) అమ్మకాలు కిందటి నెలలో 7  శాతం (ఏడాది ప్రాతిపదికన) తగ్గాయి. హీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేవ్స్ కారణంగా షోరూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు వచ్చే జనాలు కిందటేడాది జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే ఈ ఏడాది జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 15 శాతం తగ్గారని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా)  పేర్కొంది. కిందటేడాది జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 3,02,000 ప్యాసింజర్ వెహికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌   రిజిస్ట్రేషన్లు జరగగా, ఈ ఏడాది జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  2,81,566 బండ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి.  ‘కొత్త మోడల్స్ అందుబాటులో ఉన్నా, కంపెనీలు ఆఫర్లు ప్రకటించినా  మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సెంటిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాత్రం పెద్దగా పెరగలేదు.  

హీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేవ్స్ కారణంగా షోరూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు వెళ్లే జనాలు 15 శాతం తగ్గారు’ అని ఫాడా ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మనీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజ్ సింఘానియా  అన్నారు. కార్ల  కోసం కస్టమర్లు చేసే ఎంక్వైరీలు తక్కువగా ఉన్నాయని, కొనుగోలు నిర్ణయాన్ని  వాయిదా వేసుకుంటున్నారని డీలర్లు చెబుతున్నారు.  ప్యాసింజర్ వెహికల్స్ నిల్వలు భారీగా పెరిగాయని మనీష్ రాజ్ అన్నారు. వీటి ఇన్వెంటరీ  ఆల్ టైమ్ హై అయిన 62– 67 రోజులకు చేరుకుందని వివరించారు. పండగ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొదలవ్వడానికి ఇంకా టైమ్ పట్టనుండడంతో బండ్ల తయారీ కంపెనీలు  జాగ్రత్త పాటించాలని సలహా ఇచ్చారు. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండడం వలన ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి నిల్వలను సమర్థవంతంగా వాడుకోవాలని పేర్కొన్నారు. 

గ్రామాల్లో తగ్గిన టూవీలర్ అమ్మకాలు..

ఫాడా డేటా ప్రకారం, కిందటి నెలలో  టూవీలర్ల రిజిస్ట్రేషన్లు 13,75,889 యూనిట్లకు పెరిగాయి. కిందటేడాది జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే 5 శాతం గ్రోత్ నమోదు చేశాయి. టూవీలర్ షోరూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు కూడా జనాలు వెళ్లడం తగ్గింది. వర్షాకాలం ఇంకా పూర్తి స్థాయిలో మొదలుకాకపోవడం, ఎలక్షన్స్ పనులు  కారణంగా కిందటి నెలలో  రూరల్ ఏరియాల్లో  టూవీలర్ల అమ్మకాలపై నెగెటివ్ ప్రభావం పడింది. 

ఈ ఏడాది మే నెలలో జరిగిన  మొత్తం టూవీలర్ అమ్మకాల్లో 59.8 శాతం  రూరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏరియాల్లో జరగగా, ఈ ఏడాది జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ నెంబర్ 58.6 శాతానికి తగ్గింది. కమర్షియల్ వెహికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  అమ్మకాలు కిందటి నెలలో 72,747 యూనిట్లకు తగ్గాయి. కిందటేడాది జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 76,364 కమర్షియల్ బండ్లు అమ్ముడుకాగా, ఈ ఏడాది జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 5 శాతం పడ్డాయి.   ట్రాక్టర్ సేల్స్  ఏడాది ప్రాతిపదికన కిందటి నెలలో 28 శాతం  పడి 71,029 యూనిట్లుగా రికార్డయ్యాయి. అదే త్రీవీలర్ల అమ్మకాలు 89,743 యూనిట్ల నుంచి 94,321 యూనిట్లకు పెరిగాయి. 

అమ్ముడైన మొత్తం బండ్లు 18,95,552

ప్యాసింజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టూవీలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, త్రీవీలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కమర్షియల్ వెహికల్స్ మొత్తం అమ్మకాలు కిందటేడాది జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే ఈ ఏడాది జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొద్దిగా పెరిగి 18,95,552 బండ్లకు చేరుకున్నాయి. వర్షాకాలం మొదలవ్వడంతో  టూవీలర్ అమ్మకాలు పుంజుకుంటాయని ఫాడా అంచనా వేస్తోంది. కొత్త ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు స్టార్ట్ అవుతుండడంతో పాటు, సీజనల్ డిమాండ్ కారణంగా కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మంచి గ్రోత్ నమోదు చేస్తుందని ఫాడా పేర్కొంది.