సేల్స్ ఫోర్స్ పెద్ద ఎంటర్ ప్రైజెస్ సాఫ్ట్ వేర్ కంపెనీ.. 700 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. గతేడాది (2023) జనవరిలో 10శాతం అంటే సుమారు 8వేల మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత మరోసారి ఉద్యోగులను తొలగించనుంది. పెట్టుబడిదారులనుంచి ఒత్తిడి, కంపెనీ ఖర్చులను తగ్గించుకునేందుకు లేఆఫ్స్ చేపడుతున్నట్లు ప్రకటించింది.
రాబోయే రోజుల్లో లేఆఫ్స్ :
2022, 2023లో ప్రపంచ వ్యాప్తంగా టెక్ కంపెనీలు దాదాపు 4లక్షల 25వేల ఉద్యోగులను తొలగించాయి. ఇండియాలో దాదాపు 36 వేల మంది టెకీలు తమ ఉద్యోగాలు కోల్పోయారు. కొత్త సంవత్సరం 2024 జనవరిలో మొదటి రెండు వారాల్లో 46 ఐటీ కంపెనీలు దాదాపు 7,500 మంది ఉద్యోగులను తొలగించాయి. వీటిలో కొత్త స్టార్టప్ కంపెనీలు కూడా ఈ సమస్యను ఎదుర్కొన్నాయి. రాబోయే రోజుల్లో జనరేటివ్ ఏఐ(Generative AI ) ప్రభావంతో టెక్ రంగంలో మిలియన్ల ఉద్యోగాలకు ముప్పు ఉందని టెక్ నిపుణులు చెపుతున్నారు.
2024లో మార్కెటింగ్ లో ఉద్యోగాలను తొలగించిన టిక్ టాక్, గూగుల్, యూట్యూబ్, అమెజాన్, యూనిటీ, డిస్కార్డ్ వంటి కంపెనీల సరసన ఇప్పుడు సేల్స్ ఫోర్స్ కూడా చేరింది. జనవరిలో హార్డ్ వేర్, ఇంజనీరింగ్ టీంలకు చెందిన దాదాపు 1000 మంది ఉద్యోగులను ఉద్వాసన పలికింది. యూట్యూబ్ తన క్రియటర్ మేనేజ్ మెంట్, ఆపరేషన్ టీంలలో 100 ఉద్యోగాలను తొలగించింది.