లింగమయ్యా .. వస్తున్నం..ప్రారంభమైన సలేశ్వరం జాతర

లింగమయ్యా .. వస్తున్నం..ప్రారంభమైన సలేశ్వరం జాతర
  • మొదటి రోజే భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు

-అచ్చంపేట, వెలుగు :  ‘వస్తున్నాం.. వస్తున్నాం.. లింగమయ్య’ అన్న శరణుఘోషతో శుక్రవారం నల్లమల అడవులు మారుమోగాయి. తెలంగాణ అమర్‌‌నాథ్‌‌గా పిలువబడే సలేశ్వరం జాతర శుక్రవారం నుంచి ప్రారంభమైంది. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి భక్తులు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వెహికల్స్‌‌లో రాంపూర్‌‌ పెంటకు చేరుకొని, అక్కడి నుంచి నాలుగు కిలోమీటర్లు దట్టమైన అడవిలో నడిచి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు.

చుట్టూ కొండల మధ్య పారుతున్న జలపాతం వద్ద సందడి చేశారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకే భక్తులకు అనుమతి ఇచ్చారు. సలేశ్వరం వచ్చే భక్తుల కోసం నాగర్‌‌కర్నూల్‌‌, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్‌‌ నుంచి ప్రత్యేక బస్సులు నడిపారు. భక్తులకు ఎమర్జెన్సీ సేవలు అందించేందుకు అటవీ శాఖ ఆధ్వర్యంలో వలంటీర్లను నియమించారు. వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అన్నదానం చేశారు.    -