అచ్చంపేట/అమ్రాబాద్, వెలుగు: నల్లమల అటవీ ప్రాంతంలో మూడు రోజుల పాటు నిర్వహించిన సలేశ్వరం జాతర బుధవారం ముగిసింది. గతంలో కంటే ఈ ఏడాది రద్దీ తగ్గడంతో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. వెళ్లొస్తాం.. లింగమయ్య వెళ్లొస్తాం.. అంటూ భక్తులు తిరిగివెళ్లారు. గత ఏడాది జాతర సందర్భంగా ఇద్దరు చనిపోవడంతో, అధికారులు పటిష్ట చర్యలు తీసుకున్నారు.
మే నెల నుంచి అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రతి రోజు సఫారీలో సలేశ్వరం లింగమయ్యను దర్శించుకునేందుకు అవకాశం కల్పిస్తామని అధికారులు ప్రకటించడంతో భక్తుల రద్దీ తగ్గిందని అంటున్నారు.