
- బిట్ బ్యాంక్
- చట్టరీత్యా (de-–jure) రాష్ట్ర ప్రభుత్వ అధినేత గవర్నర్
- గవర్నర్‌ను నియమించే పద్ధతిని కెనడా రాజ్యాంగం నుంచి స్వీకరించడమైంది.
- గవర్నర్ లేదా గవర్నర్ విధులను నిర్వర్తించు వ్యక్తి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి లేనియెడల సీనియర్ న్యాయమూర్తి ఎదుట ప్రమాణం చేయాలి.
- 7వ రాజ్యాంగ సవరణ(1956) ప్రకారం రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కలిపి ఒకే గవర్నర్ నియమించవచ్చు.
- గవర్నర్ రాష్ట్ర శాసనసభలో అంతర్భాగంగా ఉంటాడు. కానీ, గవర్నర్ ఏ సభలో కూడా సభ్యుడు కాడు.
- గవర్నర్ తొలి సమావేశాలను ప్రారంభించడాన్ని సమన్స్ అంటారు.
- గవర్నర్ సమావేశాలను దీర్ఘకాలం వాయిదా వేయడాన్ని ప్రోరోగ్ అంటారు.
- గవర్నర్ శాసనసభ రద్దు చేయడాన్ని డిసాల్వ్ అంటారు.
- గవర్నర్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కాదు. కేంద్ర ప్రభుత్వానికి అధీనుడు కాదు. ఈ పదవి స్వతంత్ర రాజ్యాంగ పదవి అని 1979లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
- గవర్నర్ పదవి కాల పరిమితి 5 సంవత్సరాలు. కానీ, రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంతకాలం మాత్రమే పదవిలో ఉంటారు.
- రాష్ట్రపతి ఎలాంటి కారణం కారణం తెలుపకుండానే గవర్నర్‌ను తొలగించడాన్ని అభీష్టసూత్రం అంటారు.
- రాష్ట్రపతి ఎలాంటి కారణం తెలియజేయకుండానే గవర్నర్‌ను తొలగించడాన్ని అభీష్ట సూత్రం అంటారు.
- సరైన కారణాలు లేకుండా గవర్నర్‌ను తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని బి.పి.సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా(2010) కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
- గవర్నర్లపై అవిశ్వాస తీర్మానం, అభిశంసన తీర్మానం పెట్టడానికి అవకాశం లేదు.
- రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, మహిళా కమిషన్, మైనార్టీ కమిషన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, సమాచార కమిషన్లు, అధికార భాషా సంఘం చైర్మన్, సభ్యులను గవర్నర్ నియమిస్తారు.
- విధాన పరిషత్‌లోని మొత్తం సభ్యులలో 1/6 వంతు మందిని నామినేట్ చేస్తాడు.
- గవర్నర్ హైకోర్టు పరిధిలో ఉన్న న్యాయస్థానం విధించే శిక్షలకు క్షమాభిక్ష ప్రసాదించే అధికారం ఉంది.
- మరణశిక్ష విషయంలో క్షమాభిక్ష అధికారం కేవలం రాష్ట్రపతికే ఉంటుంది. గవర్నర్ కేవలం మరణశిక్షను సస్పెండ్ చేయగలడు.
- ముఖ్యమంత్రి నియామకం, మంత్రి మండలిని తొలగించడం, బిల్లులను ఆమోదించడం గవర్నర్ విచక్షణ అధికారాల పరిధికి వస్తాయి.
- రాష్ట్ర శాసనసభ సమావేశంలో లేనప్పుడు అత్యవసర చర్య తీసుకోవలసిన అవసరమేర్పడినదని గవర్నర్ భావించినప్పుడు ఆర్డినెన్స్ జారీ చేస్తాడు.
- జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో గవర్నర్ ఆర్డినెన్స్‌ను జారీ చేయాలంటే రాష్ట్రపతి పూర్వానుమతి అవసరం.
- గవర్నర్ అతని అధికారాల నిర్వహణలోను, విధుల నిర్వహణలోను న్యాయస్థానంలో జవాబుదారీ కాడు.
- రాష్ట్ర శాసన మండలి బర్తరఫ్, రాష్ట్ర శాసన సభ రద్దు, రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం వైఫల్య ప్రకటనపై రాష్ట్రపతికి సిఫారసు చేయవచ్చు.
- భారతదేశంలో అత్యధిక పదవీకాలం గవర్నర్‌గా పనిచేసిన వ్యక్తిగా నరసింహన్ రికార్డు సృష్టించాడు. (12 సంవత్సరాలు). తెలంగాణ తొలి గవర్నర్ ఈయనే.
- దేశంలో మొదటి మహిళా గవర్నర్ సరోజిని నాయుడు. 1947–1949 మధ్యకాలంలో యునైటెడ్ ప్రావిన్స్ కు గవర్నర్ గా వ్యవహరించారు.
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా గవర్నర్ శారదాముఖర్జీ (1977–78)
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి గవర్నర్ చందూలాల్ మాధవ త్రివేది (1954–57)