పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్ నగర్, వెలుగు : పిల్లలమర్రిలోని మహావృక్షాలకు సెలైన్ బాటిళ్ల ద్వారా చికిత్స అందించి పూర్వవైభవం తీసుకొచ్చామని పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రి చౌరస్తాలో రూ.30 లక్షలతో ఏర్పాటు చేసిన జంక్షన్‌ను రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు పిల్లలమర్రిని సందర్శించారు. ఈ సందర్భంగా పిల్లలమర్రిని సంరక్షించేందుకు తీసుకున్న చర్యలను ఎంపీకి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రారంభించిన హరితహారం ద్వారా మొక్కలు నాటడం మొదలు పెట్టిన తర్వాతే రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలుగా కురుస్తున్నాన్నారు. పిల్లలమర్రిని ప్రపంచంలోనే అతిపెద్ద వృక్షంగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇప్పటికే చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్రాన్ని ఒక ప్రయోగశాలగా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ కృషిని దేశమంతా గుర్తిస్తోందన్నారు. దేశంలో ఎక్కడా అమలు కాని పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని, కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే ఈ పథకాలు దేశమంతా అమలవుతాయని చెప్పారు. ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ పిల్లలమర్రిని సొంత పిల్లల్లా చూసుకున్న మంత్రిని ఎంత అభినందించినా తక్కువేననన్నారు. సెలైన్ బాటిళ్లతో ట్రీట్‌మెంట్ చేయడం గొప్ప విషయమని, పిల్లలమర్రి సంరక్షణ కోసం ఎంపీ నిధుల నుంచి రూ.2 కోట్లు కేటాయిస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న ముదిరాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రెహమాన్, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు గోపాల్ యాదవ్, కలెక్టర్ వెంకట్‌రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ సత్యనారాయణ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకుపల్లి రాజేశ్వర్ పాల్గొన్నారు.
ఇండ్లిస్తమని మోసం చేసిన కేసీఆర్
నవాబుపేట, వెలుగు: సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని పేదలను మోసం చేశారని టీపీసీసీ సెక్రటరీ, జడ్చర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఆరోపించారు. సోమవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఒక్కరోజు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్, ఎమ్మెల్యేలు విలాసవంతమైన భవనాలు కట్టుకుని పేదలను రోడ్డున పడేశారని మండిపడ్డారు. లక్షల మంది ఇండ్లు లేక పూరి గుడిసెల్లో నివసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికే కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పేదలకు ఇవ్వడంతో పాటు జాగాలున్న వారికి రూ. 3 లక్షలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం టీపీసీసీ సెక్రటరీ దేవరకద్ర ప్రదీప్‌కుమార్‌గౌడ్ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప జేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపసర్పంచుల సంఘం ప్రెసిడెంట్ రాములు నాయక్, యూత్‌కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్వాసూయాదవ్, నేతలు నాయకులు తుల్సీరాంనాయక్, హమీద్మహేక్, నవాజ్‌రెడ్డి, ఫాజిల్, నర్సిములు, రాజు, నారాయణ్‌రెడ్డి పాల్గొన్నారు.
భూ సమస్యలు వారంలో క్లియర్ చేయాలి
గద్వాల, వెలుగు: భూ సమస్యలను వారంలోగా క్లియర్ చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్ నుంచి తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ధరణి టీఎం33లో భూ సమస్యలతో పాటు పేర్లు, సర్వే నెంబర్ల మిస్సింగ్, పాస్ బుక్ డేటా కరెక్షన్ లాంటి సమస్యలు పరిష్కరించాలన్నారు. రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులను రిజిస్టార్‌లో నమోదు చేసి ఎన్ని పరిష్కరించారో..? ఎప్పటికప్పుడు రిపోర్టు ఇవ్వాలన్నారు. ఓటర్ కార్డుతో ఆధార్ లింక్ నమోదును స్పీడప్ చేయాలన్నారు. ఈ నెల 16, 17, 18 వ తేదీలలో నిర్వహించే సమైక్యత వజ్రోత్సవాలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని, అందరి సహకారంతో సక్సెస్ చేయాలని కోరారు.
సమైక్యత ఉత్సవాలకు ఏర్పాట్లు చేయండి
వనపర్తి, వెలుగు: ఈ నెల 16 నుంచి18 వరకు నిర్వహించనున్న తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 16 న ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ నుంచి మెడికల్ కాలేజీ వరకు 15 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని, మార్కెటింగ్ , మున్సిపల్, పోలీసు, డీఆర్డీవో, డీఈవో, రెవెన్యూ శాఖలు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 17న జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయిలో జెండా ఆవిష్కరణ , 18న ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ గ్రౌండ్‌లో సాంస్కృతిక సారథి కళాకారుల ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, డి.వేణుగోపాల్ పాల్గొన్నారు.
ఇండ్లిస్తమని మోసం చేసిన కేసీఆర్
నవాబుపేట, వెలుగు: సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని పేదలను మోసం చేశారని టీపీసీసీ సెక్రటరీ, జడ్చర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఆరోపించారు. సోమవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఒక్కరోజు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్, ఎమ్మెల్యేలు విలాసవంతమైన భవనాలు కట్టుకుని పేదలను రోడ్డున పడేశారని మండిపడ్డారు. లక్షల మంది ఇండ్లు లేక పూరి గుడిసెల్లో నివసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికే కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పేదలకు ఇవ్వడంతో పాటు జాగాలున్న వారికి రూ. 3 లక్షలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం టీపీసీసీ సెక్రటరీ దేవరకద్ర ప్రదీప్‌కుమార్‌గౌడ్ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప జేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపసర్పంచుల సంఘం ప్రెసిడెంట్ రాములు నాయక్, యూత్‌కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్వాసూయాదవ్, నేతలు నాయకులు తుల్సీరాంనాయక్, హమీద్మహేక్, నవాజ్‌రెడ్డి, ఫాజిల్, నర్సిములు, రాజు, నారాయణ్‌రెడ్డి పాల్గొన్నారు.
శివయ్య గౌడ్ దొరకలే
గాలింపు చర్యలను పర్యవేక్షించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
జడ్చర్ల, వెలుగు: దుందుభి వాగులో ఆదివారం గల్లంతైన గోప్లాపూర్‌కు చెందిన శివయ్య గౌడ్ ఆచూకీ ఇంకా దొరకలేదు. సోమవారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు 12 మంది గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సైతం అక్కడే ఉండి పర్యవేక్షించారు. సాయంత్రం వరకు మేక్కొండ, అమ్మపల్లి, కుర్వగడ్డపల్లి (మీనాంబ్రం) వరకు వాగు పొడవునా వెతికినా ఫలితం లేకుండా పోయింది. కాగా, శివయ్య గౌడ్ స్వగ్రామం గోప్లాపూర్ విషాధ చాయలు అలుముకున్నాయి. మృతుడి భార్య భారతమ్మ, ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకుల రోధనలు మిన్నంటాయి. శివయ్యగౌడ్ భార్య పిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రమేశ్ బాబు తెలిపారు.
సర్పంచ్ రోడ్డేయనిస్తలేడు
అమనగల్లు, వెలుగు: మాడ్గుల మండలం కలకొండ సర్పంచ్ రవీందర్ రెడ్డి నక్షబాటపై రోడ్డు వేయనివ్వడం లేదని గ్రామస్తులు ఆరోపించారు. సోమవారం జీపీ ఆఫీసు వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలకొండ నుంచి సీతారాం నగర్ తండా మీదుగా శనగల గుట్టతండా వరకు ఉన్న నక్ష బాటపై రోడ్డు వేసేందుకు ప్రభుత్వం ఫిబ్రవరిలో ఏసీడీఎఫ్ నిధుల నుంచి రూ. 3 లక్షల మంజూరు చేసిందన్నారు. అయితే ఈ బాట సర్పంచ్ సొంత పొలంలో నుంచి ఉండడంతో ఆయన పంచాయతీ తీర్మానం ఇవ్వడం లేదని మండిపడ్డారు. విషయం తెలుసుకున్న ఎంపీటీసీ జైపాల్ రెడ్డి అక్కడికి చేరుకొని సర్పంచ్‌తో చర్చించి తీర్మానం చేయిస్తామని హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించారు. మాజీ సర్పంచులు జైపాల్ నాయక్, పవన్ కుమార్ రెడ్డి, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
జీపీ కార్మికులకు రూ.26 వేలివ్వాలి
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: గ్రామ పంచాయతీ కార్మికులకు రూ.26 వేల కనీస వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లాలోని కార్మికులతో కలిసి కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్టీపర్పస్ విధానం పేరిట కార్మికులతో వెట్టిచాకిరి చేయిస్తున్నారని, వెంటనే ఈ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. వివిధ శాఖలతో పాటు కార్పొరేషన్లలో పనిచేస్తున్న పర్మినెంట్ , కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికుల వేతనాలు పెంచిన సర్కారు జీపీ కార్మికులను పట్టించుకోకపోవడం సరికాదన్నారు. ఉద్యోగాన్ని పర్మినెంట్ చేయడంతో పాటు 8 గంటల పనిదినాలు, పండుగలకు సెలవులు అమలు చేయాలని కోరారు. ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జీపీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి సుధాకర్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆంజనేయులు, శ్రీనివాసులు, పర్వతాలు, రామయ్య, మల్లేశ్, అశోక్, వెంకటేశ్వర్లు, మహేశ్ పాల్గొన్నారు.
ప్రభుత్వ కాలేజీల్లో నాణ్యమైన విద్య - ఉన్నత విద్య
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : ప్రభుత్వ కాలేజీల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నామని ఉన్నత విద్య జాయింట్ డైరెక్టర్ రాజేందర్ సింగ్ చెప్పారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కాలేజీలో నిర్వహించిన జిల్లా మావన వనరుల సమావేశానికి చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాక్‌లో గ్రేడ్ సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. విద్యార్థులకు సబ్జెక్టులతో పాటు వ్యక్తిత్వ వికాసం, పోటీ పరీక్షలకు సంబంధించిన జనరల్ నాలెడ్జ్ గురించి చెప్పాలన్నారు. పరిశోధన రంగం వైపు ఆసక్తి కల్పించేందుకు సీసీఈ నిర్వహిస్తున్న జిజ్ఞాస ప్రాజెక్టులో ప్రతి విద్యార్థిని భాగస్వామ్యం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రిన్సిపాల్స్ షాజహాన సుల్తానా, మల్లేశం, మధుసూదన్ శర్మ, మదన్, స్వర్ణలత, రామచంద్రం, డీఆర్‌సీ కోఆర్డినేటర్ డాక్టర్ మల్లికార్జున్ పాల్గొన్నారు.
గర్ల్స్ హాస్టల్‌ను తనిఖీ చేసిన జడ్జి
మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ బంగ్లా చౌరస్తా వద్ద ఉన్న ప్రభుత్వ బీసీ గర్ల్స్ హాస్టల్ ను సోమవారం జిల్లా న్యాయసేవ అధికార సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి సంధ్యారాణి అకస్మికంగా తనిఖీ చేశారు. వంటగది, బాత్ రూం, డైనింగ్ హాల్, స్టడీ రూములను పరిశీలించారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా..? అని స్టూడెంట్లను అడిగి తెలుసుకున్నారు. పేరెంట్స్ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా లక్ష్యం పెట్టుకొని చదవాలని వారికి సూచించారు. చెడు అలవాట్లకు పోవద్దని, ఉన్నతాధికారులను ఆదర్శంగా తీసుకుని చదువుపై దృష్టి పెట్టాలన్నారు. ఆమె వెంట పారా లీగల్ వలంటీర్ పి.యాదయ్య ఉన్నారు.
జిల్లాలో పటిష్టంగా షీటీమ్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : జిల్లాలో షీటీమ్ పటిష్టంగా పనిచేస్తోందని ఎస్పీ మనోహర్ తెలిపారు. సోమవారం ఎస్పీ ఆఫీసులో ప్రజావాణిలో భాగంగా ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ షీటీమ్‌కు 37 ఫిర్యాదులు అందగా.. నాలుగు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. తెలిసిన వ్యక్తులు ద్వారానే లైంగిక వేధింపులు జరుగుతున్నాయని, బాధితులు షీటీమ్‌ను ఆశ్రయించి సాయం పొందాలని సూచించారు. ఈ మధ్యకాలంలో పోక్సో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, మైనర్లను ప్రేమ, పెళ్లి పేరుతో వేధించి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు.
నులిపురుగులను నివారిద్దాం
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: చిన్నారుల ఎదుగుదలపై ప్రభావం చూపే నులిపురుగుల నివారణకు కృషి చేయాలని కలెక్టర్ ఎస్.వెంకట్ రావు సూచించారు. సోమవారం రెవెన్యూ మీటింగ్ హాలులో జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 15న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సక్సెస్ చేయాలని కోరారు. 1 నుంచి 2 ఏళ్ల పిల్లలకు అల్బెండజోల్ సగం మాత్ర, 2 నుంచి 3 ఏళ్ల పిల్లలకు మాత్రను పొడి చేసి నీళ్లు కలిపి, 3 నుంచి 19 ఏళ్లు లోపు వారికి టాబ్లెట్ పూర్తిగా ఇవ్వాలన్నారు.
భూములపై కేసుంటే కోర్టుకు వెళ్లాలి
కేసులున్న భూములకు సమస్యలను కోర్టులో పరిష్కరించుకోవాలని కలెక్టల్ వెంకట్‌రావు సూచించారు. సోమవారం ప్రజావాణిలో భాగంగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఆయా శాఖలకు పంపించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాపై మాట్లాడుతూ 16న జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు, 17న జిల్లా కేంద్రంలో జాతీయ పతాకావిష్కరణ ఉంటుందన్నారు. ఇదే రోజు సంత్ సేవాలాల్ భవన్, బంజారా భవన్‌ల ప్రారంభోత్సవం ఉంటుందని, అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 18న సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, సీతారామారావు, డీఎంహెచ్‌వో కృష్ణ, డీఐవో డాక్టర్ శంకర్, డీడబ్ల్యూవో జరినా బేగం, జడ్పీ సీఈవో జ్యోతి, ఆర్డీవో అనిల్ కుమార్, స్పెషల్ కలెక్టర్ పద్మశ్రీ పాల్గొన్నారు.
గట్టు కేజీబీవీ ఎస్‌వో టర్మినేషన్ సర్కారుకు వ్యతిరేకంగా పోస్టు పెట్టారని చర్యలు
గద్వాల, వెలుగు: సర్కారు రూల్స్‌కు వ్యతిరేకంగా వాట్సప్ గ్రూప్‌లో పోస్టు పెట్టారనే కారణంతో గట్టు కేజీబీవీ ఎస్‌వో గోపిలతను టర్మినేషన్ చేస్తూ డీఈవో, డీపీవో(ఎఫ్‌ఏసీ ఎస్‌ఎస్) సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేజీబీవీ ఎస్‌వోలకు మోడల్ స్కూల్ హాస్టల్ నిర్వహణ బాధ్యతలు అప్పజెప్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇవి అదనపు బాధ్యతలు కావడంతో తమకు ఇబ్బంది అవుతుందని ఎస్‌వో గోపిలత సర్కారుకు వ్యతిరేకంగా ఎస్‌వోల వాట్సప్ గ్రూప్‌లో పోస్ట్ పెట్టారు. ఈ పోస్టును కారణంగా చూపుతూ ఆమెను టర్మినేషన్ చేశారు. ఈ చర్యను రాష్ట్ర ఐక్య టీచర్స్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండించింది. ఎస్‌వో సంఘం సూచన మేరకే పోస్ట్ పెట్టారని, ఇది రూల్స్‌కు విరుద్ధం ఎలా అవుతుందని ప్రశ్నించింది. వెంటనే టర్మినేషన్ ఎత్తివేయాలని, లేదంటే ఉద్యమం చేస్తామని హెచ్చరించింది.
రెండు వైన్సుల్లో లిక్కర్ బాటిళ్లు చోరీ
కందనూలు, వెలుగు: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలోని మహాలక్ష్మి, సాయి వైన్సుల్లో చోరీ జరిగింది. దుండగులు ఆదివారం అర్థరాత్రి చొరబడి దాదాపు రూ. 50 వేలు విలువైన మద్యం సీసాలను ఎత్తుకెళ్లారు. యాజమానులు సోమవారం ఉదయం వైన్సులను తెరచి చూడగా.. ర్యాక్‌లు ఖాళీగా కనిపించాయి. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణ ఓబుల్ రెడ్డి తెలిపారు.
టీచర్‌పై చర్యలు తీసుకోవాలి
అమనగల్లు, వెలుగు: మాడ్గుల మండలం అవుర్పల్లి హైస్కూల్‌లో విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న సోషల్ టీచర్ రమణారావుపై చర్యలు తీసుకోవాలని ఎంపీపీ పద్మా రెడ్డి డిమాండ్‌చేశారు. కొన్నిరోజులుగా టీచర్ వేధిస్తున్నాడని స్టూడెంట్లు వారి తల్లిదండ్రులకు చెప్పడంతో ఎంపీపీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సోమవారం పేరెంట్స్‌తో కలిసి స్కూల్‌కు చేరుకున్న ఎంపీపీ హెచ్‌ఎం రాములు ఆధ్వర్యంలో రమణారావుని విచారించగా పొంతనలేని సమాధానం చెప్పారు. ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె.. డీఈవో దృష్టికి తీసుకెళ్తామన్నారు.