హాలీవుడ్‌‌ థ్రిల్లర్‌లో సల్మాన్ ఖాన్, సంజయ్ దత్..

హాలీవుడ్‌‌ థ్రిల్లర్‌లో సల్మాన్ ఖాన్, సంజయ్ దత్..

బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, సంజయ్ దత్‌‌ ఇప్పుడు ఓ హాలీవుడ్‌‌ సినిమాలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. అక్కడ ఇటీవల ప్రారంభించిన స్టూడియోలో వీళ్లిద్దరిపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. బుధవారంతో ఈ షూటింగ్ పూర్తి కానుంది. అతిథి పాత్రలే అయినప్పటికీ సినిమాలో కీలకంగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. 

ఇదొక థ్రిల్లర్ మూవీ అనే సమాచారం మినహా.. సినిమా టైటిల్, మేకర్స్ వివరాలేవీ రివీల్ చేయలేదు. మరోవైపు సల్మాన్ ఖాన్ సినిమా ‘సికందర్‌‌‌‌’కు సంబంధించి మంగళవారం అప్‌‌డేట్ ఇచ్చారు. నిర్మాత సాజిద్ నడియద్‌‌వాలా బర్త్‌‌డే సందర్భంగా సల్మాన్‌‌ కొత్త పోస్టర్‌‌‌‌ను విడుదల చేశారు. దాంతో పాటు ఈనెల 27న ఓ సర్‌‌‌‌ప్రైజింగ్‌‌ అప్‌‌డేట్‌‌ ఇవ్వబోతున్నట్టు చెప్పారు. 

అలాగే రిలీజ్‌‌ డేట్‌‌ విషయంలో క్లారిటీ ఇస్తూ ఈద్ సందర్భంగా మార్చిలో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సల్మాన్‌‌కు జంటగా రష్మిక మందన్న నటిస్తోంది. కాజల్ అగర్వాల్ ఈ చిత్రంతో బాలీవుడ్‌‌లో రీఎంట్రీ ఇస్తోంది. తమిళ నటుడు సత్యరాజ్‌‌ విలన్‌‌గా నటిస్తున్నారు.