పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఆటగాళ్లకు అసలు ఫిట్ నెస్ ఉండదనే పేరుంది. ఫీల్డింగ్ లో పేలవ ప్రదర్శన చేస్తూ.. తరచూ గాయాలపాలవుతూ విమర్శలను మూట కట్టుకుంటారు. టీ20 వరల్డ్ కప్ 2024 కు ముందు ఆటగాళ్లందరినీ ఆర్మీకి పంపినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ మెగా టోర్నీలో కనీసం సూపర్ 8 దశకు చేరుకోలేక ఇంటిదారి పట్టింది. స్టార్ ఆటగాళ్లు ఉన్నా.. ఫిట్ నెస్ లేకపోవడం పాకిస్థాన్ కు పెద్ద సమస్యగా మారింది. తాజాగా పాక్ ఆటగాళ్ల ఫిట్ నెస్ పై మాజీ ఆటగాడు సల్మాన్ బట్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పాకిస్థాన్ ఆటగాళ్లకు ఫిట్ నెస్ లెవల్స్ ఉండవని ఆయన అన్నారు. అయితే కొంతమంది పాక్ క్రికెటర్లను సమర్దించాడు. ఫఖర్ జమాన్ , మహ్మద్ రిజ్వాన్, షాన్ మసూద్‌లను తమ జట్టులో ఫిట్‌గా ఉన్న ఆటగాళ్లుని తెలిపారు. వారు యో-యో టెస్ట్‌లలో మంచి స్కోర్లు సాధించారని.. జిమ్‌లో, మైదానంలో బాగా పరిగెత్తగలరని చెప్పుకొచ్చాడు. ఈ ముగ్గురు ప్రపంచ క్రికెట్ లో టాప్ టెన్ ర్యాంక్ లో ఉంటారని.. బంగ్లాదేశ్‌తో జరగబోయే టెస్ట్ సిరీస్‌కు జట్టులో తగిన ఫిట్‌నెస్ స్థాయిలు లేవని అతను తన యూట్యూబ్ ఛానెల్‌లో తెలిపారు.
బంగ్లాదేశ్ తో రెండు టెస్ట్ ల మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ రావల్పిండి వేదికగా జరగాల్సి ఉంది. రెండో టెస్ట్ కరాచీ నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఫిబ్రవరి 21 నుంచి రావల్పిండి వేదికగా టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది.
పాక్ - బంగ్లా టెస్ట్ సిరీస్ షెడ్యూల్
మొదటి టెస్టు(ఆగస్టు 21- ఆగస్టు 25): రావల్పిండి క్రికెట్ స్టేడియం
రెండో టెస్టు(ఆగస్ట్ 30- సెప్టెంబర్ 03): కరాచీ నేషనల్ స్టేడియం
Salman Butt names Shan Masood, Fakhar Zaman, and Mohammad Rizwan as the fittest cricketers in the Pakistan cricket team.
— PTV Cricket News (@PTVCricketNews4) August 17, 2024
.
.
.#SalmanButt #PakistanCricket #GOAT #TheGOAT #Cricket pic.twitter.com/DStaloWdD8