Salman Butt: పాకిస్థాన్‌లో ఆ ఇద్దరు క్రికెటర్లు మిల్లర్, క్లాసన్‌లా ఆడగలరు: సల్మాన్ బట్ జోస్యం

Salman Butt: పాకిస్థాన్‌లో ఆ ఇద్దరు క్రికెటర్లు మిల్లర్, క్లాసన్‌లా ఆడగలరు: సల్మాన్ బట్ జోస్యం

పాకిస్థాన్ క్రికెట్ పతన స్థాయికి దిగజారుతుంది. ఫార్మాట్ ఏదైనా ఆ జట్టు సమిష్టిగా విఫలమవుతుంది. ఇటీవలే సొంతగడ్డపై జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఘోరంగా విఫలం కావడంతో సొంత జట్టుపై ఆ దేశ అభిమానులే తీవ్రంగా విమర్శిస్తున్నారు. స్టార్ ప్లేయర్స్ బాబర్ అజామ్, షహీన్ షా అఫ్రిది, నజీమ్ షా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతుంటే .. మహమ్మద్ రిజ్వాన్, సల్మాన్ అఘా మాత్రమే అరకొర రాణిస్తున్నారు. కొత్త ఆటగాళ్లు అబ్రార్ అహ్మద్, మహమ్మద్ హారిస్ లపై పాకిస్థాన్ క్రికెట్ భారీగా ఆశలు పెట్టుకుంది. పాకిస్థాన్ క్రికెట్ క్షీణ దశలో ఉన్న సమయంలో మాజీ ఓపెనర్ సల్మాన్ బట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  

పాకిస్థాన్ జట్టులో గతంలో స్టార్ ఓపెనర్ గా గుర్తింపు తెచ్చుకున్న సల్మాన్ బట్ ఇద్దరు పాకిస్థాన్ ఆటగాళ్లపై నమ్మకముంచాడు. ఖుషుడిల్ షా, యంగ్ ప్లేయర్ అబ్దుల్ సమద్ లను భవిష్యత్ స్టార్ ఆటగాళ్లగా మారగలరని ఆయన చెప్పుకొచ్చాడు. ఇటీవలే ఒక పోడ్ కాస్ట్ లో మాట్లాడుతూ.. "పాకిస్థాన్ జట్టుకు మిడిల్ ఆర్డర్ లో మిల్లర్, క్లాసన్ లాంటి ఆటగాళ్లు అవసరం. ఖుషుడిల్ షా, అబ్దుల్ సమద్ ఇద్దరూ మిల్లర్, క్లాసన్ లా ఆడితే ఎలా ఉంటుంది. ముందుగానే ఒక అంచనాకు రావడం కష్టం. అయితే ఫ్యూచర్ లో వీరిద్దరూ మిల్లర్, క్లాసన్ లా ఆడతారని నాకు అనిపిస్తుంది. ఇద్దరికీ ఆల్ ది బెస్ట్". అని బట్ చెప్పుకొచ్చాడు. 

ALSO READ | KL Rahul: ఢిల్లీ క్యాపిటల్స్‌కు కొత్త సమస్య.. ఐపీఎల్‌లో కూడా రాహుల్‌కు అన్యాయం చేస్తారా!

ప్రస్తుతం పాకిస్థాన్.. న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. ఇందులో భాగంగా 5 టీ20 మ్యాచ్ లు ఆడనుంది. ఇప్పటివరకు జరిగిన రెండు  టీ20 మ్యాచ్ ల్లోనూ పాకిస్థాన్ ఓడిపోయింది. తొలి మ్యాచ్ లో ఖుషుడిల్ షా అద్భుతంగా ఆడి టాప్ స్కోరర్ గా నిలిస్తే.. మంగళవారం (మార్చి 18) జరిగిన రెండో టీ20 లో విఫలమయ్యాడు. మరోవైపు అబ్దుల్ సమద్ ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ విఫలమయ్యాడు. కివీస్ తో సిరీస్ ముగిసిన వెంటనే పాకిస్థాన్ తమ సొంత లీగ్ పిఎస్ఎల్ ఆడనుంది. ఏప్రిల్ 14 నుంచి మే 18 వరకు ఈ లీగ్ జరగనుంది.