Sikandar Box Office: సల్మాన్ ఖాన్కు కలిసిరాని ఈద్.. సికందర్ రెండ్రోజుల బాక్సాఫీస్ రిపోర్ట్

Sikandar Box Office: సల్మాన్ ఖాన్కు కలిసిరాని ఈద్.. సికందర్ రెండ్రోజుల బాక్సాఫీస్ రిపోర్ట్

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "సికందర్". ఈ మూవీ రంజాన్ సందర్భంగా ఆదివారం (మార్చ్ 30) రిలీజ్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు ఈ సినిమా రూ.54.72 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఫస్ట్ డే (ఆదివారం) ఇండియా వైడ్గారూ.35కోట్లకి పైగా గ్రాస్ దక్కించుకుంది.

ఇకపోతే, సికందర్ మూవీ రెండ్రోజులలో రూ.55కోట్లకి పైగా నెట్ వసూళ్లు దక్కించుకుంది. అందులో ఆదివారం రూ.26 కోట్లు, ఈద్ రోజున (సోమవారం) రూ.29 కోట్లు వసూలు చేసింది. అయితే, సోమవారం ఈద్ పండుగ ఉండటంతో వసూళ్లు తగ్గినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ మూవీ మొత్తం హిందీ ఆక్యుపెన్సీలో సోమవారం (2వ రోజు) ఉదయం షోలు: 8.38%, మధ్యాహ్నం షోలు: 26.70%, సాయంత్రం షోలు: 30.18%, నైట్ 33.12% నమోదు చేసుకుంది. 

అయితే, 2025లో బాలీవుడ్ లో రిలీజైన మూవీస్ 2వ రోజు ఉదయం ఆక్యుపెన్సీ చూసుకుంటే..

చావా: 33%
స్కై ఫోర్స్: 23.52%
లవ్‌యాపా: ​​10.09%
బాదాస్ రవి కుమార్: 9.38%
సికందర్: 8.38%
ది డిప్లామేట్: 7.08%
దేవా: 5.84%

AR మురుగదాస్ దర్శకత్వం వహించిన సికిందర్ మూవీ.. విక్కీ కౌశల్ నటించిన ఛావా కంటే దాదాపు 74% తక్కువ. బాలీవుడ్‌లో అత్యధికంగా విడుదలైన వాటిలో ఒకటైన బాదాస్ రవి కుమార్ మరియు లవ్‌యాపా కంటే సికిందర్ మూవీ తక్కువ వసూళ్లు సాధించడం విచారకరం.

సికందర్ vs సౌత్ సినిమాలు:

L2: ఎంపురాన్ ఐదవ రోజు ఉదయం షోలలో 56.84% ఆక్యుపెన్సీతో ఆధిక్యంలో కొనసాగుతోంది. మ్యాడ్ స్క్వేర్ (27.26%), వీర ధీర సూరన్ డే (19.36%), మరియు రాబిన్‌హుడ్ (10.62%) కూడా మెరుగైన ప్రదర్శనని ఇస్తున్నాయి.