సల్మాన్ హీరోగా వచ్చిన ‘కిక్’ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిందో తెలిసిందే. ఈ యాక్షన్ కామెడీ మూవీకి ఇప్పుడు సీక్వెల్ రాబోతోంది. 2014లో ‘కిక్’ విడుదల కాగా, సరిగ్గా పదేళ్లకు సీక్వెల్‌ను ప్లాన్ చేస్తున్నారు. దర్శకుడు సాజిద్ నడియావాలా శుక్రవారం ఈ విషయాన్ని ప్రకటించారు.
ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సికందర్’ చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు సల్మాన్ ఖాన్. ఈ మూవీ షూటింగ్ బ్రేక్‌లో ‘కిక్ 2’కు సంబంధించిన ఫొటో షూట్ నిర్వహించారు. ఇందుకు సంబంధించి, సల్మాన్ వెనుక నుంచి తీసిన ఫొటోను రిలీజ్ చేశారు. ఇక రవితేజ హీరోగా వచ్చిన తెలుగు సినిమా ‘కిక్’ను అప్పట్లో హిందీలో రీమేక్ చేశారు. ఆ తర్వాత తెలుగులో సీక్వెల్ తీసినప్పటికీ సక్సెస్ కాలేదు. ఇప్పుడు సల్మాన్ ఇమేజ్‌కు తగ్గ ఫ్రెష్ కంటెంట్‌తో సీక్వెల్ తీయబోతున్నారు సాజిద్. హీరోయిన్, ఇతర వివరాలు త్వరలో రివీల్ చేయనున్నారు.