
ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ' సికందర్ '. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ కి జోడిగా రష్మిక మందన్నా నటిస్తోంది. లేటెస్ట్గా ఈ మూవీ మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. 'సికందర్ నాచే' (Sikandar Nache) అనే టైటిల్ టైటిల్ ట్రాక్ రేపు (మార్చి 18న) రిలీజ్ కాబోతుందంటూ గ్లింప్స్ రివీల్ చేశారు.
ఇందులో సల్మాన్ ఖాన్, రష్మిక డ్యాన్స్ మూవ్మెంట్ తో పాటు రష్మిక బ్యూటీనెస్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సల్మాన్ పూర్తిగా బ్లాక్ డ్రెస్సులో ఎనర్జిటిక్ గా ఎంట్రీ ఇస్తుండగా.. రష్మిక తనదైన ఒంపులతో అట్రాక్ట్ చేస్తోంది. దాంతో రష్మిక మందన్న డ్యాన్స్ బీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఇకపోతే, హోలీ సందర్భంగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. హోలీ నేపథ్యంలో వచ్చే ఈ ‘భం భం భోలే’ పాట ట్రేండింగ్ లో దూసుకెళ్తోంది. ఈ పాటలో సల్మాన్ డ్యాన్సులు, రష్మికతో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అభిమానులను ఇంప్రెస్ చేశాయి.
హోలీ గొప్పతనాన్ని తెలియజేస్తూ సాగిన లిరిక్స్, రంగుల పండుగ నేపథ్యంలో సాగిన చిత్రీకరణ ఆకట్టుకుంది. సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తున్న ఈ చిత్రం రంజాన్ సందర్భంగా మార్చి 30 లేదా 31న విడుదల కానుంది.
Also Read : ఓటీటీకి ఆస్కార్‌లో ఆధిపత్యం చూపించిన వేశ్య కథ.. ఎక్కడ చూడాలంటే?
ఇకపోతే, 2014లో వచ్చిన 'కిక్' సినిమా తర్వాత సల్మాన్ ఖాన్, సాజిద్ మళ్ళీ ఈ సినిమాతో వస్తున్నారు. అలాగే రష్మిక మందన్నా లేటెస్ట్ హిట్ సినిమాలు చావా, పుష్ప 2 ది రూల్ లలో తన నటనకు గాను ప్రశంసలు అందుకున్నారు. దాంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఈ మూవీలో రష్మిక మందన్నతో పాటు కాజల్ అగర్వాల్,సత్యరాజ్,శర్మన్ జోషి మరియు ప్రతీక్ బబ్బర్ నటించారు.