బాలీవుడ్ ప్రముఖ హీరో సల్మాన్ ఖాన్ గత కొన్ని రోజులుగా గ్యాంగ్ స్టర్స్ నుంచి ఇబ్బందులు ఎదుర్కుంటున్నాడు. ఈ క్రమంలో ఇటీవలే సల్మాన్ ఖాన్ స్నేహితుడు మరియు నటుడు బాబా సిద్ధిక్ ని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ దారుణంగా హతమార్చింది. దీంతో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాబా సిద్ధిక్ హత్యని తామే చేసినట్లు స్పష్టం చేసారు.
ఇప్పుడు తమ టార్గెట్ సల్మాన్ ఖాన్ అని ఈ క్రమంలో తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే బాబా సిద్ధిక్ ని హతమార్చినదానికంటే మరింత దారుణంగా సల్మాన్ ఖాన్ ని హత్య చేస్తామని బెదిరింపులకు పాల్పడుతూ వాట్సాప్ లో మెసేజ్లు పంపుతున్నారు. దీంతో పోలీసులు సల్మాన్ ఖాన్ కి భద్రత పెంచారు.
ALSO READ | ఖడ్గం సినిమాలో ఆ హీరో ప్లేస్ లో నాగార్జున ని తీసుకోవాలనుకున్నారా..?
ఇటీవలే ముంబై పోలీసులకి గుర్తు తెలియని ఫోన్ నంబర్ నుంచి ఓ మెసేజ్ వచ్చింది. అందులో " ఈ మెసేజ్ ని తేలికగా తీసుకోవద్దు. సల్మాన్ ఖాన్ ప్రాణాలతో ఉండాలంటే తమకి రూ. 5 కోట్లు ఇవ్వాలని అలాగే లారెన్స్ బిష్ణోయ్ తో శత్రుత్వం ముగించి తమ డిమాండ్లు తీర్చాలని లేదంటే సల్మాన్ ఖాన్ ని దారుణంగా హత్య చేస్తామని ఉంది.
దీంతో పోలీసులు ఈ మెసేజ్ ఎవరు పంపించారనే విషయం గురించి ఆరా తీస్తున్నారు. అలాగే సల్మాన్ ఖాన్ కి Y+ కేటగిరీకి అప్‌గ్రేడ్ చేశారు. దీంతో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు తప్ప సల్మాన్ ఖాన్ ని కలవడానికి వీలు ఉండదు.
A threatening message has been received on the WhatsApp number of Mumbai Traffic Police, in which Rs 5 crore has been demanded from actor Salman Khan. The sender claimed, "Don't take it lightly, if Salman Khan wants to stay alive and wants to end the enmity with Lawrence Bishnoi,…
— ANI (@ANI) October 18, 2024