తెలుగులో మాస్ మహారాజ రవితేజ నటించిన కిక్ చిత్రాన్ని హిందీలో అదే పేరుతో రీమేక్ చేశారు. హిందీలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా నటించాడు. ఈ చిత్రం తెలుగులో మాదిరిగా హిందీలో కూడా పెద్ద హిట్ అయ్యింది. కాగా ఈ చిత్రానికి బాలీవుడ్ ప్రముఖ హీరో సాజిద్ నడియావాల దర్శకత్వం వహించాడు.
లవ్ & ఎమోషన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపుగా 232 కోట్లు కలెక్ట్ చేసి దర్శకనిర్మాతలకు లాభాలు తెచ్చింది. దీంతో కిక్ చిత్ర సీక్వెల్ కోసం సల్మాన్ ఖాన్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.
దీంతో తాజాగా చిత్ర యూనిట్ కిక్ మూవీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. ఇందులోభాగంగా కిక్ సీక్వెల్ కోసం సల్మాన్ లుక్స్ టెస్ట్ చేస్తున్న సమయంలో తీసిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా ఈ కిక్ 2 అప్డేట్ ని నదియాడ్‌వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో అధికారికంగా ప్రకటించింది. దీంతో సల్మాన్ ఖాన్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
అయితే తెలుగులో కిక్ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక డిజాస్టర్ గా నిలిచింది. మరి కిక్ 2 తో హిందీలో సల్మాన్ ఖాన్ ఏవిధంగా ఆకట్టుకుంటాడో చూడాలి.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హిందీలో సికిందర్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఈద్ కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తన పూర్తీ షెడ్యూల్ ని ఈ సికిందర్ చిత్రం కోసం కేటాయిస్తున్నాడు.