SikandarTeaser: సికందర్ టీజర్ రిలీజ్.. సల్మాన్తో మురుగదాస్ మాస్ ఫీస్ట్ అదిరింది

SikandarTeaser: సికందర్ టీజర్ రిలీజ్.. సల్మాన్తో మురుగదాస్ మాస్ ఫీస్ట్ అదిరింది

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సికందర్ (Sikandar). ఈ మూవీలో సల్మాన్కు జంటగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటిస్తోంది. తమిళ దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో రుపొందిన ఈ మూవీ టీజర్ తాజాగా (ఫిబ్రవరి 27న) రిలీజ్ చేశారు మేకర్స్. నదియద్వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్స్పై సాజిద్ నడియాద్వాలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మురుగదాస్- సల్మాన్ కాంబోపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకి తగ్గట్టుగా టీజర్ ఆసక్తికరంగా సాగింది. హ్యాండ్-టు-హ్యాండ్ యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయాయి. ఇన్నాళ్లు దర్శకుడు మురుగదాస్ సోషల్ కంటెంట్తో వచ్చి ప్రేక్షకులకు ఓ ఆరా చూపించాడు. ఇప్పుడు సల్మాన్తో భారీ యాక్షన్ సినిమాతో వస్తూ  ఎలాంటి మాస్ ఫీస్ట్ అందించనున్నాడనేది ఆసక్తిగా మారింది.

ALSO READ : Choreographer Son: కొడుకును పరిచయం చేసిన స్టార్ కొరియోగ్రాఫర్.. తగిన వారసుడొచ్చాడంటూ ఫ్యాన్స్ ప్రశంసలు

అంతేకాకుండా దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్తో వస్తోన్న సికందర్ మూవీపై హైప్ మాములుగా లేదు. దానికితోడు, మన తెలుగు సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ను శాసిస్తున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ నుంచి సినిమా వస్తుండటంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. మరి నిర్మాతలు పెట్టిన బడ్జెట్కి డబుల్ వసూళ్లు వస్తాయో లేదో చూడాలి. ఇకపోతే, సికందర్ మూవీ ఈద్ సందర్భంగా మార్చి 30 లేదా 31న విడుదల కానుంది. సల్మాన్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ 'కిక్ 2'లో కూడా కనిపించనున్నాడు.

ఇకపోతే, 2014లో వచ్చిన 'కిక్' సినిమా తర్వాత సల్మాన్ ఖాన్, సాజిద్ మళ్ళీ ఈ సినిమాతో వస్తున్నారు. అలాగే రష్మిక మందన్నా లేటెస్ట్ హిట్ సినిమాలు చావా, పుష్ప 2 ది రూల్ లలో తన నటనకు గాను ప్రశంసలు అందుకున్నారు. దాంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఈ మూవీలో రష్మిక మందన్నతో పాటు కాజల్ అగర్వాల్,సత్యరాజ్,శర్మన్ జోషి మరియు ప్రతీక్ బబ్బర్ నటించారు.