
చిరంజీవి ‘గాడ్‌ఫాదర్’లో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో కనిపించనున్నాడనే వార్త మెగా ఫ్యాన్స్‌కి చాలా సంతోషాన్ని కలిగించింది. ఇప్పుడు సల్మాన్ సెట్‌లో జాయినయ్యే టైమ్ కూడా వచ్చేసింది. ‘గాడ్‌ఫాదర్’ నెక్స్ట్ షెడ్యూల్ ఈ నెలాఖరు నుంచి కానీ, వచ్చే నెల మొదటి వారం నుంచి కానీ మొదలు కాబోతోంది. ఈసారి షూట్లో సల్మాన్ కూడా పాల్గొనబోతున్నాడు. ఒరిజినల్ వెర్షన్ ‘లూసిఫర్’లో పృథ్విరాజ్ సుకుమారన్ చేసిన పాత్రలో సల్మాన్ నటిస్తున్నాడు. హీరో ఇబ్బందుల్లో పడినప్పుడల్లా వచ్చి సేవ్ చేసే క్యారెక్టర్. మలయాళ మూవీలో ఈ పాత్ర నిడివి చాలా తక్కువ. కానీ తెలుగులో కాస్త పెంచుతున్నట్లు తెలిసింది. సల్మాన్, చిరులపై ఓ సాంగ్ కూడా ప్లాన్ చేశారు. దీన్ని వరల్డ్ ఫేమస్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్‌తో పాడించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తన పోర్షన్ షూట్‌కి ఏడు రోజులు కేటాయించాడట సల్మాన్. కొవిడ్ పరిస్థితులు అనుకూలిస్తే అనుకున్న సమయానికి షూట్ కంప్లీట్ చేసేలా టీమ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు బాలీవుడ్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు సల్మాన్. ‘టైగర్ 3’ సెట్స్‌పై ఉంది. ‘భాయీజాన్’ రిలీజ్‌కి రెడీ అవుతోంది. భజరంగీ భాయీజాన్, నో ఎంట్రీ సీక్వెల్స్ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. షారుఖ్ నటిస్తున్న ‘పఠాన్’లోను, ఆమిర్ నటిస్తూ నిర్మిస్తున్న ‘లాల్‌సింగ్ చద్ధా’లోను కీలక పాత్రల్లో కనిపించనున్నాడు సల్మాన్.