Salman Khan Watch: సల్మాన్ ఖాన్ చేతికి రాముడి వాచ్..  మత సంఘాలు గరం గరం..  

Salman Khan Watch: సల్మాన్ ఖాన్ చేతికి రాముడి వాచ్..  మత సంఘాలు గరం గరం..  

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ధరించిన చేతి వాచ్ వ్యవహారం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు సికిందర్ సినిమా రిలీజ్ సమయంలో సల్మాన్ ఖాన్ కి తలనొప్పి తెచ్చేలా ఉంది. అయితే సల్మాన్ ఖాన్ ఇటీవలే ఓ ఫోటో షూట్ లో భాగంగా ఔట్ ఫిట్ కి తగట్టుగా వాచ్ ధరించాడు. ఇందులో తప్పేముంది అనుకుంటున్నారా..? అక్కడికే వస్తున్నా... 

ఈ వాచ్ రామ్ జన్మభూమి ఎడిషన్  కి సంబందించింది. ఈ వాచ్ కాషాయ రంగు బెల్టుని కలిగి ఉండటంతోపాటూ ఇందులోని గడియారంలో రామ జన్మభూమిని మరియు భారతీయ చరిత్రలో దాని ప్రాముఖ్యతను వివరిస్తూ హ్యాండ్ మేడ్ తో తయారు చేశారు. దీంతో కొందరు ముస్లిం సంఘ నాయకులు సల్మాన్ ఖాన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే అల్లా దేవుడిని పూజిస్తూ హిందూ దేవుడైన రామ్ జన్మభూమి ఎడిషన్ వాచ్ ని ధరించడం పాపమని విమర్శలు చేస్తున్నారు. ముస్లిం జమాత్‌కు చెందిన మౌలానా షాహబుద్దీన్ రజ్వీ కూడా ఈ విషయంపై స్పందిస్తూ సల్మాన్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సల్మాన్ కు ముస్లిం ఫ్యాన్స్ అధికంగా ఉన్నారని కాబట్టి అతను ఇస్లాం వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని మౌలానా పేర్కొన్నారు.

అయితే మార్చ్ 30న సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన "సికిందర్" సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో రష్మిక మందాన హీరోయిన్ గ నటించగా ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాని దాదాపుగా రూ.300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇలాంటి సమయంలో సల్మాన్ ఖాన్ మత వివాదంలో చిక్కుకోవడంతో మేకర్స్ టెన్షన్ పడుతున్నారు. మరి సల్మాన్ ఖాన్ ఈ విషయంపై ఎలా స్పందిస్తాడో చూడాలి.