మహారాష్ట్రలో ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు వరుస బెదిరింపులు వస్తున్నాయి. సల్మాన్ ను చంపుతామంటూ రోజుకొకరు వార్నింగ్ ఇస్తున్నారు. లేటెస్ట్ గా మరోసారి సల్మాన్ ఖాన్‌కు మరో బెదింపు వచ్చింది. ఈ సారి సల్మాన్‌ను బెదిరించింది నోయిడాకు చెందిన 20 ఏళ్ల వ్యక్తి. అతడిని పోలీసులు అరెస్టు చేశారు. బాబా సిద్ధిక్ కుమారుడు జీషన్ సిద్ధిక్‌కు కూడా ఇదే యువకుడి నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. అయితే డబ్బుకోసమే బెదించారంటూ పోలీసులు చెబుతున్నారు.
ఇటీవలే 2024 అక్టోబర్ 18వ తేదీన.. ముంబై పోలీసులకు.. సల్మాన్ ను చంపేస్తాం.. చంపకుండా ఉండాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలని ముంబై ట్రాఫిక్ పోలీసులకు బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో వాట్సప్ లో మెసేజ్ చేశారు. ముంబై పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోకపోతే మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిక్ కంటే దారుణంగా సల్మాన్ ను చంపేస్తామని హెచ్చరించిన సంగతి తెలిసిందే.. దీనిపై విచారణ జరిపిన ముంబై ట్రాఫిక్ పోలీసులు జార్ఖండ్ జంషెడ్ పూర్ కు చెందిన కూరగాయాల వ్యాపారిని అరెస్ట్ చేశారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తో వైరం కారణంగా సల్మాన్ ప్రాణాలకు నిరంతరం బెదిరింపులు వస్తున్నప్పటికీ సల్మాన్ ఇంకా స్పందించలేదు.
ALSO READ : అమితాబ్ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్న చిరంజీవి
ఇష్యూమరో వైపు బిహార్ ఎంపీ రాజేశ్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్ ను కూడా చంపుతామని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరించిన సంగతి తెలిసిందే.. బాలీవుడ్ యాక్టర్ సల్మాన్ ఖాన్ కు సంబంధించినకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. ‘‘నీ కదలికలను మేం నిశితంగా పరిశీలిస్తున్నాం. మా హెచ్చరికలను పట్టించుకోకపోతే చంపేస్తాం” అని బెదిరించింది. పప్పూ యాదవ్ కు బిష్ణోయ్ గ్యాంగ్ మెంబర్ ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడగా, ఆ ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. ఈ క్రమంలో తనకు భద్రత పెంచాలని పోలీసులకు లేఖ రాశారు పప్పూ యాదవ్.