Sikandar : యాక్షన్ ప్యాక్డ్ సికందర్ మూవీ ట్రైలర్‌‌‌‌‌‌‌‌

Sikandar : యాక్షన్ ప్యాక్డ్   సికందర్ మూవీ ట్రైలర్‌‌‌‌‌‌‌‌

సల్మాన్ ఖాన్ హీరోగా తమిళ దర్శకుడు మురుగదాస్ రూపొందించిన హిందీ చిత్రం ‘సికందర్’. రష్మిక మందన్నా హీరోయిన్‌‌‌‌గా నటించగా, కాజల్ అగర్వాల్, సత్యరాజ్  కీలక పాత్రలు పోషించారు. సాజిద్ నడియాద్వాలా నిర్మించిన  ఈ చిత్రం రంజాన్ సందర్భంగా ఈనెల 30న విడుదలవుతోంది. ఆదివారం ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు.  యాక్షన్ ప్యాక్డ్‌‌‌‌గా కట్ చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది.  సల్మాన్ వింటేజ్ లుక్‌‌‌‌లో కనిపిస్తూ  తనదైన  యాక్షన్ మోడ్‌‌‌‌తో మరోసారి  అభిమానులను అలరించనున్నట్లు ట్రైలర్ ద్వారా  తెలు స్తోంది. 

భారీ యాక్షన్ సీన్స్‌‌‌‌తో పాటు కథ లోని కీలక సన్నివేశాలను, అలాగే  కొన్ని రొమాంటిక్ లవ్ సీన్స్‌‌‌‌ చూపిస్తూ ట్రైలర్‌‌‌‌‌‌‌‌తోనే  సినిమాపై ఆసక్తిని పెంచారు. సంజయ్ రాజ్‌‌‌‌కోట్‌‌‌‌గా సల్మాన్‌‌‌‌, సాయి శ్రీగా రష్మిక, మినిస్టర్‌‌‌‌‌‌‌‌ ప్రధాన్‌‌‌‌గా సత్యరాజ్ పాత్రలు హైలైట్‌‌‌‌గా నిలిచాయి.   సల్మాన్, రష్మిక మధ్య  కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. కాజల్ ఇంటరెస్టింగ్ రోల్‌‌‌‌లో కనిపించనుందని తెలుస్తోంది.  ప్రీతమ్ అందించిన మ్యూజిక్ ఇంప్రెస్ చేస్తోంది.