హోం ఐసొలేషన్ లో సల్మాన్ ఖాన్

హోం ఐసొలేషన్ లో సల్మాన్ ఖాన్

 కారు డ్రైవర్…  సెక్యూరిటీ సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో ఐసొలేషన్ కు..

ముంబై: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హోం ఐసొలేషన్ కు వెళ్లారు. తన కారు డ్రైవర్ తోపాటు.. ఇద్దరు పర్సనల్ సెక్యూరిటీ సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో సల్మాన్ ఖాన్.. తన కుటుంబ సభ్యులతో కలసి హోమ్ ఐసొలేషన్ కు వెళ్లారు.  సినిమా షూటింగ్ లకు ప్రభుత్వం అనుమతించడంతో సల్మాన్ ఖాన్.. ప్రభుదేవా దర్శకత్వంలో రానున్న ఓ  సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. దిశ పటాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ కొద్ది రోజుల క్రితమే ప్రారంభమైంది. కరోనా రూల్స్ పాటిస్తూ షూటింగ్ జరుపుతున్నారు. నిన్న షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్ కారు డ్రైవర్ తోపాటు ఇద్దరు పర్సనల్ సెక్యూరిటీ సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వారిని వెంటనే ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సల్మాన్ ఖాన్ తన షూటింగ్ ను రద్దు చేసుకుని కుటుంబ సభ్యులతో కలసి హోం ఐసొలేషన్ కు వెళ్లారు.

Read more news

షుగర్ ఉంటే తేనె వాడొచ్చా..?

కళ్ల ముందే అద్భుతాలు.. త్వరలో అందుబాటులోకి ఏఆర్ టెక్నాలజీ

ఫ్లిప్ కార్ట్ యూజర్లు ఆల్ టైమ్ హై

కరోనా టెస్ట్.. జస్ట్ రూ.850

పేకాటలో టెక్నాలజీ.. తండ్రీ కొడుకుల ఛీటింగ్