సాలూర అబ్బాయి వెడ్స్ ఇండోనేషియా అమ్మాయి

బోధన్, వెలుగు: నిజామాబాద్​ జిల్లా సాలూరకు చెందిన గోనె నీలకంఠానికి ఇండోనేషియా దేశానికి చెందిన డీజెన్ ​దెబోరతో సోమవారం బోధన్​లోని రవి గార్డెన్స్ లో వివాహం జరిగింది. ఇజ్రాయిల్ పీహెచ్​డీ చదువున్న టైంలో వీరిద్దరూ ఇష్టపడ్డారు.

వీరి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకున్నారు. దీంతో అమ్మాయి తరఫు బంధువులు వారం రోజుల కింద సాలూరకి వచ్చి హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి నిశ్చయించుకున్నారు. సోమవారం బోధన్​లో పెండ్లి జరిగింది.